మద్యం మత్తులో దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. మత్తులో ఉన్న వ్యక్తి విచక్షణ మరచి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం చావడికోటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో తల్లిదండ్రులను అతికీరాతకంగా కత్తితో నరికి చంపాడు కొడుకు.. చావడి కోటకు చెందిన మృతులు సన్యాసిరెడ్డి (68), బోడెమ్మ (62) కుమారుడు మల్లిరెడ్డి.
అల్లూరి సీతారామరాజు జిల్లా అటవీప్రాంతం సీలేరు నుండి గోకవరం వెళ్లే ఆర్టీసీ బస్సులో రోజ్ వుడ్ కలప మంచాలను పుష్ప సినిమా తరహాలో తరలిస్తున్నారు. పుష్ప సినిమా తరహాలో విలువైన కలపను తరలించారు స్మగ్లర్లు..
Tragedy : అల్లూరి సీతారామరాజు జిల్లాలోని జీకే విధి మండలంలోని చింతపల్లి క్యాంపు గ్రామం సోమవారం ఉదయం భయానక ఘటనకు వేదికైంది. కుటుంబ కలహం ఉద్ధృతంగా మారి, చివరికి నిండు ప్రాణాలను బలి తీసుకుంది. భార్యతో జరిగిన ఘర్షణతో ఆగ్రహానికి గురైన భర్త, జోక్యం చేసుకున్న తన ఇద్దరు బావమర్దులను ఒకేసారి త్రిశూలంతో పొడిచి హత్య చేసిన ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. DRDO : భారత్-పాక్ యుద్ధంలో హైదరాబాద్ డీఆర్‌డీవో కీలక పాత్ర హత్యకు గురైన…
ఆంధ్రా ఊటీ అరకువ్యాలీ చలి ఉత్సవాలకు సిద్ధం అయింది. ఉర్రూతలూగించే అడ్వెంచర్స్, హెలీ రైడ్స్ ఒక పక్క.. గిరిజన సాంప్రదాయ కార్నివాల్ మరోపక్క.. ఎటు చూసిన ధూమ్ ధామ్ వాతావరణమే కనిపించనుంది. ఏజెన్సీ పర్యాటకాన్ని మరింత ప్రమోట్ చేసేందుకు అరకు ఫెస్ట్ ను అట్టహాసంగా నిర్వహిస్తోంది పర్యాటక శాఖ. జనవరి 31 నుంచి మూడు రోజులపాటు అరకు చలి ఉత్సవం నిర్వహించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు జరిగాయి..
ఏజెన్సీ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన కొనసాగుతోంది.. నిన్న పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించిన ఆయన.. పలు అభివృద్ధికి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఆయన.. ఈ రోజు అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనకు సిద్ధమయ్యారు.. అనంతగిరి మండలం బల్లగరువు (పినకోట పంచాయతీ)లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన కొనసాగనుంది.. ఈ పర్యటనలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు పవన్.. ఉదయం 10.30 గంటలకు బల్లగరువు ప్రాంతానికి చేరుకోనున్నారు డిప్యూటీ సీఎం…
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో మావోయిస్టులు అలజడి సృష్టించారు. అర్ధరాత్రి సమయంలో సరివెల వద్ద జాతీయ రహదారి-30పై గ్జైలో(XYLO) కారును పూర్తిగా దగ్ధం చేసారు. ఈనెల 2 నుండి 8 వరకు జరిగిన మావోయిస్టు వారోత్సవాలు ముగిసిన వెంటనే ఈ ఘటన జరగడంపై పోలీసులు అప్రమత్తమయ్యారు.
బట్టలు ఆరేస్తుండగా జరిగిన ఘటన ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.. ఒకేసారి ఏకంగా ముగ్గురు మృతి చెందారు.. తల్లి, ఇద్దరు పిల్లలు ఒకేసారి ప్రాణాలు కోల్పోవడం విషాదంగా మారింది..
ఒక పక్క వరదలు, మరో వైపు వర్షాలతో అల్లూరి సీతారామరాజు జిల్లా విలీన మండలాలు అతలాకుతలం అయ్యాయి. చింతూరు ఏజన్సీలో గత రెండువరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక పక్కన శబరి, మరోవైపు గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీనికి తోడు పలు వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో జన జీవనం అస్త వ్యస్థంగా మారింది.