ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందని ప్రకటించారు. ఇక ఈ రెండు భాగాల బడ్జెట్ రూ.250 కోట్ల వరకు ఉంటుందట. రెండు భాగాలుగా తెరకెక్కుతునన్ “పుష్ప” ఒకేసారి తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇక ఇప్పటికే విడుదల చేసిన ‘ది ఇంట్రడక్షన్ ఆఫ్ పుష్పరాజ్’ వీడియో ఇంటర్నెట్ లో రికార్డుల మీద…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. సహజంగా ప్రయోగాలు చేయడానికి పెద్దంత ఇష్టపడడు. కమర్షియల్ అంశాలు జత అయిన సినిమాల్లో డిఫరెంట్ గా కనిపించడానికి మాత్రం తపిస్తూ ఉంటాడు. అలా చేసిన సినిమాలే ‘డీ.జె. దువ్వాడ జగన్నాథమ్’, ‘నా పేరు సూర్య’ చిత్రాలు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ‘పుష్ప’ సినిమా కూడ అదే కోవకు చెందింది. ఎర్రచందనం స్మగ్లర్ గా నటిస్తున్న అర్జున్ ఓ డిఫరెంట్ గెటప్ లో ఇందులో కనిపించబోతున్నాడు. విశేషం ఏమంటే… రెండు భాగాలుగా…
టాలీవుడ్ స్టార్ హీరోల లిస్ట్ లో ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇద్దరికీ మంచి స్థానం ఉంది. అలాగే అభిమానులు కూడా ఇద్దరికీ భారీగానే ఉన్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరూ కూడా పాన్ ఇండియా స్టార్స్ రేసులో ఉన్నారు. తారక్, అల్లు అర్జున్ ఇద్దరూ డ్యాన్స్ లోనూ నటనలోనూ ఎవరికి వారే ప్రత్యేకం. అయితే తాజాగా వీరిద్దరి అభిమానుల మధ్య ట్విట్టర్ వార్ మొదలైంది. ఎక్కడ మొదలైందో, ఎలా మొదలైందో తెలీదు కానీ… మా హీరో గొప్ప అంటే…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప’ సినిమా షూటింగ్ జులై నుంచి జెట్ స్పీడ్ లో జరగనుందట. కరోనా సెకండ్ వేవ్ కంటే ముందే ఈ సినిమా 75 శాతం చిత్రీకరణను పూర్తిచేసుకుంది. దర్శకుడు సుకుమార్ ఎట్టకేలకు ఈ చిత్రాన్ని దసరా పండక్కి విడుదల చేయాలని భావిస్తున్నాడట. షూటింగ్ పునప్రారంభించిన వెంటనే విడుదల తేదీని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ పుష్పరాజ్గా కనిపించనున్నారు. బన్నీ…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ ప్రఖ్యాత సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఇన్ స్టాగ్రామ్ లో సరికొత్త రికార్డ్ సృష్టించారు. దేశంలో ఏ స్టార్ వైఫ్ కి లేనంత ఫాలోయివర్స్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ ఇన్ స్టాగ్రామ్ లో సంపాదించుకున్నారు. మొత్తంగా 4 మిలియన్ల ఇన్ స్టా ఫాలోవర్స్ తో అల్లు స్నేహ రికార్డు సృష్టించారు. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా స్నేహ ఈ ఘనత అందుకోవడం విశేషం. ఐకాన్…
ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ ఇప్పుడు ఫోటోగ్రాఫర్ గా మారాడు. ఆయన ఇటీవల కాలంలో తాను తీసిన అద్భుతమైన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన తాను తీసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల పిక్స్ ను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అందులో అల్లు అర్జున్ సన్ షైన్ లో మెరుస్తూ ఉండగా… బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న పిక్…
దర్శకుడు బోయపాటి శ్రీను ప్రస్తుతం ‘అఖండ’ సినిమా పూర్తిచేసే పనిలో పడ్డాడు. త్వరలోనే షూటింగ్ మొదలెట్టి ప్యాకప్ చెప్పేయనున్నాడు. ‘సింహా’, ‘లెజెండ్’ వంటి సూపర్ హిట్ సినిమాల తరువాత వస్తున్న కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇక అఖండ టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా తరువాత బోయపాటి చేయబోయే చిత్రంపై రకరకాల పేర్లు వినిపించాయి. కాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయాల్సి…
దీపావళప్పుడు కాల్చే క్రాకర్స్ లో ‘రాకెట్స్’ ఉంటాయి. అవి వెలిగించాక ఆకాశంలోకి ఎంత పైదాకా వెళతాయో అస్సలు చెప్పలేం. స్టార్ హీరోల సినిమాలు కూడా అంతే! నిర్మాణం సమయంలోనే కాస్త బజ్ కూడా ఏర్పడితే ఇక ఏదైనా జరగొచ్చు. ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా అవ్వొచ్చు. అల్లు అర్జున్ స్టారర్ ‘పుష్ప’ చుట్టూ ఏర్పడుతోన్న క్రేజ్ ఇప్పుడు అలానే ఉంది… ‘పుష్ప’ సినిమాని మొదట సింగిల్ మూవీగానే తీస్తామన్నారు. తరువాత అది కాస్తా రెండు భాగాలుగా…
ఐకాన్స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ‘పుష్ప’ సినిమాపై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. బన్నీ సరసన రష్మిక నటిస్తుండగా.. ఫహద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. ఈ కథ బాగా పెద్దది కావడంతో రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు నిర్ణయించారు. అయితే తాజాగా ఈ సినిమాపై సుకుమార్ శిష్యుడు, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు స్పందించాడు. పుష్ప మొదటి పార్ట్ ఒక్కటే పది కేజీయఫ్ సినిమాలతో సమానం అన్నాడు. అల్లు…
టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘అల వైకుంఠపురములో’ బాలీవుడ్ లోకి రీమేక్ అవుతుందన్న వార్తలు వినిపిస్తూనే వున్నా ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే తాజాగా ఈ తెలుగు సినిమా రీమేక్ లో నటించడానికి కార్తీక్ ఆర్యన్ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ కథానాయికగా నటించనుందట. ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం బడా నిర్మాతలు పోటీపడుతున్నారు. అయితే ఇటీవలే ఓ నిర్మాత అల్లు అరవింద్ ను కలిసి ఓ నిర్ణయానికి వచ్చినట్లు…