ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” అనే భారీ పాన్ ఇండియన్ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అనౌన్స్మెంట్ రాబోతోంది. ఈ రోజు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. “పుష్ప”కు డీఎస్పీ సంగీత సారధ్యం వహిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మూవీ ఆడియో ఆల్బమ్ నుండి మొదటి సింగిల్‌పై పెద్ద అప్‌డేట్‌ను ప్రకటించడానికి ప్లాన్ చేస్తున్నారు.
Read Also : “ఆర్ఆర్ఆర్” దోస్తీ సాంగ్ @ 20 మిలియన్స్
అలాగే మేకర్స్ ఈ సందర్భంగా విడుదల తేదీని కూడా ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే అసలు అప్డేట్ ఏంటి ? అనే విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు. కానీ బిగ్ అప్డేట్ అవుతుందని బన్నీ అభిమానులు అనుకుంటున్నారు. “పుష్ప” మొదటి భాగం ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. మేకర్స్ త్వరలో ప్రమోషన్స్ ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఆల్బమ్ నుండి మొదటి సింగిల్ ను విడుదల చేసే అవకాశాలే ఎక్కువగా కన్పిస్తున్నారు. మరి ఆ అప్డేట్ ఏంటో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
Its 'AA'UGUST 2nd .. @ThisIsDSP's Birthday & 🔥🔥
— Pushpa (@PushpaMovie) August 1, 2021