ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మధ్య తాజాగా జరిగిన మీటింగ్ టాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది. వీరిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ మూవీస్ రూపొందాయి. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో చిత్రాలతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశారు. నిన్నటితో (ఆగష్టు 9) “జులాయి” మూవీ విడుదలై 9 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్, త్రివిక్రమ్ క్యాజువల్ గా కలుసుకున్నారని తెలుస్తోంది. ఈ మేరకు త్రివిక్రమ్ నేడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను తన ఆఫీస్ లో కలిశారు. ఇద్దరూ కలిసి “జులాయి” జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. వీరిద్దరూ కలిసి దిగిన పిక్ ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఈ మీటింగ్ కారణంగా త్వరలోనే మరోసారి వీరిద్దరి కాంబో రిపీట్ అవ్వబోతోందేమో అనే అనుమానాలు రేకెత్తిస్తోంది.
Read Also : చిరంజీవి స్పెషల్ ఫోటోషూట్… పిక్స్ వైరల్
ఇక బన్నీ ఇప్పుడు తన పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప” సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ భారీ మూవీలో మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ చిత్రం మొదటి భాగం క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. మరోవైపు త్రివిక్రమ్ రాబోయే రెండు నెలల్లో మహేష్ బాబుతో కలిసి “ఎస్ఎస్ఎంబి28” షూటింగ్ ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాడు.