క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తను చదువుకున్న స్కూల్ కోసం భారీగా సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలోని ఆయన స్వగ్రామం మట్టపర్రు ప్రభుత్వ పాఠశాలను నిర్మించడానికి తనవంతు సాయం చేశారు. స్కూల్ భవనం కోసం సుకుమార్ రూ.18 లక్షలు ఖర్చుచేసి నిర్మించారు. అంతేకాకుండా భవనానికి తన తండ్రి పేరును పెట్టారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ తో కలిసి సుకుమార్ దంపతులు ఈ భవనాన్ని ప్రారంభించి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇకపై తాను మట్టపర్రు గ్రామాభివృద్ధికి ఎలాంటి సాయం కావాలన్నా చేస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.
Read Also : గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన ఆది పినిశెట్టి…
ప్రస్తుతం సుకుమార్ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప”తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ సమయంలో డెంగ్యూ ఫీవర్ భారిన పడిన సుకుమార్ కోలుకుని మళ్ళీ షూటింగ్ ప్రారంభించారు.