బేబీ నిర్మాత అయిన ఎస్.కె.ఎన్ ఇంట్లో ఇటీవలే విషాదం చోటు చేసుకుంది. ఎస్.కె.ఎన్ తండ్రి గాదె సూర్యప్రకాశరావు జనవరి మొదటి వారంలో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సూర్యప్రకాశరావు మరణించడంతో… సినీ ప్రముఖులు, ఇండస్ట్రీ వర్గాలు, మెగా అభిమానులు ఎస్.కే.ఎన్ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు. సూర్యప్రకాశరావు అంత్యక్రియలు ఫిలిం నగర్ లోని మహాప్రస్థానం లో జరిగాయి. తనకి అంత్యంత సన్నిహితుడు అయిన ఎస్.కె.ఎన్ తండ్రి మరణించడంతో అల్లు అర్జున్… ఎస్.కె.ఎన్ ఇంటికి వెళ్లి పరామర్శించాడు.…