Alleti Maheshwar Reddy: అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టిన బడ్జెట్.. ఇచ్చిన హామీలను పాతరేసేలా ఉందని బీజేపీ శాసన సభాపక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణ వస్తే బతుకులు మారుతాయని అనుకున్నారు.. కానీ, రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది.. పదేళ్లలో లక్షల కోట్లు అప్పు చేసింది గత ప్రభుత్వం.. గొప్పలకు పోయి గత ప్రభుత్వం నిధులు వృథా చేసింది అని ఆరోపించారు.
Alleti Maheshwar Reddy: ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ చూస్తే హామీల ఎగవేతల బడ్జెట్ లా ఉందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఇది మొండి చేయి ఇచ్చే బడ్జెట్.. గొప్పలు చెప్పుకొనే బడ్జెట్.. కేవలం 36 వేల కోట్లతో అభివృద్ధి ఎలా సాధ్యమో భట్టి విక్రమార్క చెప్పాలన్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం పట్ల బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రజలు మోడీ నాయకత్వాన్ని బలపరుస్తున్నారని.. ఈ ఎన్నికలలో స్పష్టం అవుతోందని ఆయన అన్నారు. రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతోందని ఆరోపించారు.
Alleti Maheshwar Reddy : కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీపై ఢిల్లీ బీజేపీ కాల్కాజీ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ బిదురి చేసిన వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతోంది. రమేష్ బిదురి వ్యాఖ్యలకు నిరసనగా, రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ కేంద్ర మంత్రులను అడ్డుకోవాలని యూత్ కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ కార్యకర్తలు హైదరాబాద్ నాంపల్లి బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. రాళ్లు, కోడిగుడ్లతో దాడులు చేసి, రమేష్ బిదూరి దిష్టిబొమ్మను దహనం చేశారు. Formula E Car Race…
సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచనా దినోత్సవంగా నిర్వహించాలని….ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఓవైసీలకు భయపడే రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17 ను విమోచనా దినోత్సవంగా నిర్వహించడం లేదని, గతంలో బీఆర్ఎస్ కూడా ఒవైసీలకు భయపడే నిర్వహించలేదన్నారు. బీఆర్ఎస్ సర్కార్ లో వున్నప్పుడు సమైక్యత దినోత్సవంగా నిర్వహించారని, ఇప్పడు కాంగ్రెస్ సర్కార్ ప్రజాపాలన దినోత్సవం అంటోందన్నారు మహేశ్వర్ రెడ్డి. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు ఒక్కొక్కరు…
భారీ వర్షాలతో తెలంగాణలో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించిందని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. రెండు కేంద్ర బృందాలు పర్యటిస్తూ నష్టాన్ని అంచనా వేస్తున్నాయని, NDRF బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. వరదలతో చనిపోయిన వారి కుటుంబాలకు మూడు లక్షల రూపాయలు కేంద్రం సహాయం ప్రకటించిందని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అత్మగౌరవానికి ప్రతీక సెప్టెంబర్ 17 అని, అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17ను నిర్వహించలేకపోతోందని ఆయన విమర్శించారు. సెప్టెంబర్ 17…
పెండింగ్‌లో ఉన్న రైతుల రుణాలను త్వరలో మాఫీ చేయాలని బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. లేని యెడల నిర్మల్ జిల్లా కేంద్రంగా ఈ నెల 23న రైతులతో పెద్ద ఎత్తున ధర్నాకు దిగుతామని ఆయన వెల్లడించారు. ఈ రైతు ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి, ప్రభుత్వ మేడలు వంచుతాం ఏలేటి మహేశ్వర్ అన్నారు. రైతు భరోసాకు ఇవ్వాల్సిన నిధులనే రుణమాఫీకి డైవర్ట్ చేశారు, ఇప్పటికే రెండు పంటలకు రైతు భరోసా సాయం ఇవ్వకుండా…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే.. ఈ రోజు అసెంబ్లీలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ తో బీఅర్ఎస్ నేతలు వేల కోట్ల ఎకరాలు కబ్జా చేశారని వార్తలు వచ్చాయన్నారు. ఆ నేతలు ఎవరు? కాజేసిన భూమి ఎది? అనేది కాంగ్రెస్ బహిర్గతం చేయడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. మరి కాకి లెక్కలు చెప్తున్నారని ఆయన మండిపడ్డారు. భూములు ఎవరు కాజేశారనేది వెల్లడించాలని మహేశ్వర్ రెడ్డి కోరారు. మంత్రి మాట్లాడుతూ….భూముల…
గత రెండు రోజులుగా బీఆర్ఎస్ నాటకం ఆడిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి మండిపడ్డారు. ఇవాళ ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. వారి అరాచకం తెలంగాణ మొత్తం చూసిందని, నిన్న అప్రాప్రేషన్ బిల్లు పై బీజేపీ మాట్లాడకుండా చేసారన్నారు. మా గొంతు నొక్కారని ఆయన మండిపడ్డారు. అప్పటికే మేము ఓపికతో ఉన్నామని, బీఅర్ఎస్ నేతలకు ఇష్టం లేకుంటే వాక్అవుట్ చేయాలన్నారు. వెల్ లోకి వెళ్లి అరవడంతో సభ్యులెవరూ మాట్లాడేందుకు రాలేదని, ఈరోజు కూడా…
రైతులందరికీ రుణ మాఫీ చేయనందుకే బీ అర్ ఎస్ అక్కడ కూర్చొందన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. అదే బాటలో కాంగ్రెస్ నడవటం బాధాకరమని, రుణ మాఫీ కి 30 వేల కోట్లకు పైగా బడ్జెట్ అవసరం అని చెప్పారన్నారు. కానీ అంత బడ్జెట్ పెట్టలేదని, సీఎం చెప్పిన లెక్కల ప్రకారం 70 లక్షల మంది రైతులు తెలంగాణలో ఉన్నారన్నారు. కానీ ఇందులో కోత విధించినట్లు తెలుస్తోందని, ఏ ప్రాతిపాదికన రైతులను…