ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం పట్ల బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రజలు మోడీ నాయకత్వాన్ని బలపరుస్తున్నారని.. ఈ ఎన్నికలలో స్పష్టం అవుతోందని ఆయన అన్నారు. రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతోందని ఆరోపించారు. గతంలో ఆప్ పార్టీ తప్పుడు హామీలతో, అవినీతి ఆరోపణలు ఎదుర్కొనడంతో ప్రజలు ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పారని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఏ ఒక్క అవినీతి ఆరోపణలు లేకుండా.. స్వచ్చమైన సుపరిపాలన అందిస్తున్న నరేంద్ర మోడీని దేశ ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
Read Also: Fastag : ప్రభుత్వం ప్రకటించిన ఫాస్టాగ్ వార్షిక పాస్ తో ఎలాంటి లాభాలుంటాయి ?
గతంలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి పట్ల.. ఆ ప్రభుత్వాన్ని ప్రజలు ఎలా గద్దె దించారో, ప్రస్తుతం ఢిల్లీ ఎన్నికల్లో కూడా ప్రజలు అలాంటి తీర్పే ఇచ్చారని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. రాబోవు రోజుల్లో తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూడా ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని.. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ అవినీతి పాలన మాదిరిగానే.. కాంగ్రెస్ పాలన కొనసాగుతున్నదని తెలిపారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని చీదరించుకుంటున్నారని అన్నారు. తెలంగాణలో రాబోయేది రామ రాజ్యమే అని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: Rajamouli: గతానికి భిన్నం.. వేట మొదలెట్టిన జక్కన్న!