కాళేశ్వరం పై ఆ రెండు పార్టీలు డ్రామా చేస్తున్నాయంటూ విమర్శలు గుప్పించారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఇవాళ ఆయన ఆదిలాబాద్ లో ఎన్టీవీతో మాట్లాడుతూ.. ప్రాజెక్టు వద్దకు వారు పిక్ నిక్ కు వెల్తున్నారు..పోటీ పడి ఎమ్మెల్యేలను తీసుకోని టూర్లు వేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. వాళ్లంతా డ్రామా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం అవినీతిపై ఒక్క లేఖ ఇస్తే సీబీఐ రంగంలోకి దిగుతుందని, సీబీఐకి ఇవ్వండి ..ఎవ్వరి చిత్తశుద్ది ఏంటో బయటపడుతుంది…దోషులు ఎవ్వరో తేలుస్తారన్నారు.…
నిర్మల్‌లో గత పాలకుల పాపాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిర్మల్ లో ప్రభుత్వ భూములను గత పాలకులు అన్యాక్రాంతం చేశారన్నారు. గతంలో చెప్పినట్లుగా ఆధారాలతో సహా కలెక్టర్‌కి ఫిర్యాదు చేశామని ఆయన వెల్లడించారు. వాస్తవాలను శేత్వార్ తో సహా పరిశీలించి అధికారులే విస్తుపోయారని, ప్రభుత్వ భూమిలోనే ప్రైవేట్ సంస్థ డీ మార్ట్ నిర్మాణం చేస్తున్నారన్నారు. సర్వే నెం. 256 ప్రభుత్వ భూమి, ఇందులో డీమార్ట్ కు…
తెలంగాణ ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) చాలా తెలివిగా వ్యవహరిస్తు్న్నారని.. అందుకే బడ్జెట్‌ను కూడా చాలా తెలివిగా ప్రవేశపెట్టారని బీజేపీ ఫ్లోర్ లీడర్, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) ఎద్దేవా చేశారు.
నెలరోజుల ఉత్కంఠ అనంతరం నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని శాసనసభాపక్ష నేతగా బీజేపీ అధిష్టానం బుధవారం నియమించింది. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, కామారెడ్డి ఎమ్మెల్యే కె వెంకట రమణారెడ్డిని డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌లుగా నియమించినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ఇక్కడ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. కాగా ముధోలే ఎమ్మెల్యే రామారావు పటేల్‌ను శాసనసభా పక్ష కార్యదర్శిగా నియమించారు. పార్టీ చీఫ్ విప్‌గా సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్…
తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు కొనసాగుతున్నాయి. తాజాగా, ఏఐసీసీ వ్యవహారాల ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి.. టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మణిరావు ఠాక్రేకు లేఖ రాయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.