Uttar Pradesh: పాఠశాల పక్కన ఉన్న మద్యం దుకాణాన్ని ఎత్తేయాలని కోరుతూ ఓ ఎల్‌కేజీ విద్యార్థి హైకోర్టును ఆశ్రయించాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
Uttarpradesh : ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎమ్మెల్యే రఫీక్ అన్సారీకి అలహాబాద్ హైకోర్టు నుంచి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
ఒక కేసును విచారిస్తున్నప్పుడు, హిందూ వివాహ చట్టం ప్రకారం వివాహం చేసుకోవడానికి 'కన్యాదానం' అవసరం లేదని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ వ్యాఖ్యానించింది. అశుతోష్ యాదవ్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. చట్టం ప్రకారం, కేవలం 'సప్తపది' (ఏడడుగులు) మాత్రమే హిందూ వివాహానికి అవసరమైన వేడుక అని పేర్కొంది.
Uttarpradesh : అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ యుపి బోర్డ్ ఆఫ్ మదర్సా ఎడ్యుకేషన్ యాక్ట్ 2004 రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. ఈ చర్య లౌకికవాద సిద్ధాంతానికి విరుద్ధమని కోర్టు పేర్కొంది.
Alahabad High Court : లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో నివసిస్తున్న వివాహిత ముస్లిం మహిళ దాఖలు చేసిన పిటిషన్ ను అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. తనకు ప్రాణహాని ఉందని ఆ మహిళ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
జ్ఞానవాపి మసీదు వివాదంపై అలహాబాద్ హైకోర్టు నేటి ఉదయం సంచలన తీర్పు వెల్లడించింది. జ్ఞానవాపి మసీదు సెల్లార్‌లోని వ్యాస్ కా తేకానాలో హిందువులు పూజలు చేసుకునేందుకు అనుమతిస్తూ ఇటీవల వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కూడా సమర్థించింది.
Gyanvapi Case: జ్ఞానవాపి మసీదు వివాదంలో అలహాబాద్ హైకోర్టు తన తీర్పు రిజర్వ్ చేసింది. ఇటీవల జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో సెల్లార్‌లో హిందువులు పూజలు చేసుకునేందుకు వారణాసి జిల్లా కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే, వారణాసి కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌ని ఈ రోజు జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ విచారించారు. కోర్టు తన ఉత్తర్వులను రిజర్వ్ చేశారని కమిటీ తరుపున వాదిస్తున్న ఎస్ఎఫ్ఏ నఖ్వీ తెలిపారు.
Gyanvapi Case: జ్ఞానవాపీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వారణాసి కోర్టు దక్షిణ సెల్లార్‌లో హిందువులు పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వడంతో, ముస్లిం పక్షం అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. అయితే, పూజలు కొనసాగించేందుకే హైకోర్టు మొగ్గు చూపించడంతో ముస్లిం పక్షానికి ఎదురుదెబ్బ తాకినట్లైంది.
ఉద్యోగం, ఆదాయం లేనందున తన భార్యకు భరణం చెల్లించలేనని భర్త చెప్పడం తగదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగం లేకపోయినా కూలి పనిచేసైనా విడాకులు తీసుకున్న భార్యకు భరణం చెల్లించాల్సిందేనని న్యాయస్థానం తీర్పునిచ్చింది. కూలి పనులు చేసైనా రోజుకు రూ.300 లేదా రూ.400 సంపాదించైనా భరణం చెల్లించాలని భర్తను కోర్టు ఆదేశించింది.