టీడీపీలో ఆళ్ల నాని చేరిక మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తోంది. టీడీపీలోకి ఆళ్ల నానిని తీసుకునేందుకు పార్టీ పెద్దలు నిన్న ముహూర్తం ఫిక్స్ చేయగా.. పార్టీ అధినేత సమయం ఇవ్వక పోవడంతో ఆళ్ల నాని చేరిక వాయిదా పడింది. ఆళ్ల నాని చేరికపై టీడీపీ కేడర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆళ్ల నాని.. తెలుగుదేశం పార్టీలోకి రావడానికి లైన్ క్లియర్ అయ్యింది. అప్పుడు తాత్కాలికంగా వాయిదా పడినా.. ఇప్పుడు టీడీపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.. దీంతో.. రేపు ఉదయం 11 గంటలకు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పసుపు కండువా కప్పుకోనున్నారు ఆళ్ల నాని.
టీడీపీలో మాజీ మంత్రి ఆళ్ల నాని చేరికకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.. ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు.. ఆళ్ల నాని.. టీడీపీలో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.. అంతేకాదు.. ఆళ్లనాని టీడీపీలోకి వస్తే.. ఆయన వల్ల పార్టీకి ఎలాంటి ఉపయోగం ఉండదని.. పార్టీ రాష్ట్ర నాయకత్వానికి తేల్చిచెప్పారు.. గతంలో టీడీపీ నేతలను టార్గెట్ చేసి.. వేధింపులకు గురిచేశారని కూడా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు.. దీంతో, ఆళ్ల నాని చేరికను పోస్ట్‌పోన్ చేసింది టీడీపీ.. ఏలూరు జిల్లా…
మాజీ డిప్యూటీ సీఎం, ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని టీడీపీలో చేరేందుకు లైన్ క్లియర్ అయ్యింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కీలకంగా వ్యవహరించిన ఆళ్ల నాని మూడు నెలల క్రితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. అప్పటినుంచి ఎవరికీ అందుబాటులో లేని ఆళ్ల నాని టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
వైసీపీ పదవులకు రాజీనామా చేసిన ఆ నాయకుడిది వ్యూహమా? లేక వైరాగ్యమా? పార్టీలోనే కొనసాగుతూ…. జిల్లా అధ్యక్ష పదవికి మాత్రం రాజీనామా చేయడాన్ని ఎలా చూడాలి? పవర్‌లో లేని పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ చేతి చమురు వదిలించుకోవడం ఎందుకని అనుకుంటున్నారా? లేక ప్రత్యక్ష రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవాలనుకుంటున్నారా? ఎవరా నాయకుడు? ఇలాంటి వ్యవహారాల్లో ఆయన గతం ఏం చెబుతోంది? ఏపీలో పొలిటికల్‌గా కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏలూరు ఒకటి. ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్…
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో బిగ్ షాక్ తగిలింది.. పార్టీకి, పార్టీ పదవులకు కీలక నేత గుడ్‌బై చెప్పేశారు.. గోదావరి జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఏలూరు అసెంబ్లీ ఇన్చార్జి పదవితోపాటు ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేస్తూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాజీనామా లేఖ పంపించారు.