Alla Nani Fires On Pawan Kalyan Over Volunteers Controversial Comments: పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి ఎన్ని కుట్రలు పన్నినా.. సీఎం జగన్‌ను ఏమీ చేయలేరని మాజీమంత్రి ఆళ్లనాని చెప్పారు. రాష్ట్రంలో రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనని.. జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం ఏలూరులో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ లబ్ది కోసమే వాలంటీర్స్‌పై పవన్ కళ్యాణ్, చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఈ విమర్శల వెనుక కుట్రకోణం దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. వలంటీర్ల వ్యవస్థపై వాళ్లు విషం చిమ్ముతున్నారని.. తల్లిదండ్రులు సైతం బాధపడే విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వృద్ధులు, వితంతువులకు ఉదయాన్నే ఎన్నో సేవలు అందించే వాలంటీర్స్.. మహిళల అక్రమ రవాణ కావడానికి కారణమని నీచమైన ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Sajjala Ramakrishna Reddy: వాలంటీర్లపై ప్రతిపక్షాలు చేస్తున్న విద్వేష ప్రచారాన్ని తిప్పికొట్టాలి
వాలంటీర్ వ్యవస్థను కూల్చడానికి పవన్ కళ్యాణ్, చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆళ్ల నాని ఆరోపణలు చేశారు. పవన్ ఒక ఉన్మాదిలాగా మాట్లాడుతున్నారని, చంద్రబాబు అందించిన స్క్రిప్టునే ఆయన చదువుతున్నాడని పేర్కొన్నారు. గతంలో ఎప్పుడూ జరగని అభివృద్ధి రాష్ట్రంలో జరుగుతోందని, అది చూసి ఓర్వలేకే ఇలా విషం కక్కుతున్నారని చెప్పారు. వాలంటీర్ వ్యవస్థపై అధ్యయనం చేయకుండా దిగజారి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. అసలు మహిళల అక్రమ రవాణాకు, వాలంటీర్లకు సంబంధం ఏంటి? అని ప్రశ్నించారు. తణుకు సభలో పవన్ తీరు పరాకాష్టకు చేరిందని.. అసాంఘిక శక్తిలా మాట్లాడాడని విరుకుపడ్డారు. వాలంటీర్ల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా పవన్ వ్యాఖ్యానించారని ధ్వజమెత్తారు. పవన్ రెండు నాలుకల ధోరణిని ప్రజలు గమనించాలని సూచించారు. పవన్ కళ్యాణ్ అసత్య ప్రచారాలు మానుకోవాలని.. వాలంటీర్ల జోలికొస్తే చూసు్తూ ఊరుకోమని ఆళ్ల నాని హెచ్చరించారు.
Rashmika mandanna : బేబీ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్నాను..