ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) యూరోపియన్ శాఖ ఇవాళ (గురువారం) విడుదల చేసిన నివేదిక ప్రకారం.. కౌమారదశలో ఉన్నవారిలో ఆల్కహాల్, ఈ-సిగరెట్‌లను విస్తృతంగా వినియోగిస్తున్నట్లు తెలిపింది.
మద్యం తాగొద్దని చెప్పినందుకు తన కుమారుడిని దుండగులు హత్య చేశారని ఓ తల్లి ఆరోపిస్తుంది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. జహంగీర్‌పురిలో దుండగులు 19 ఏళ్ల యువకుడిని కత్తితో పొడిచి చంపారు. వివరాల్లోకి వెళ్తే.. మద్యం తాగవద్దని యువకుడి తల్లి కొందరు అగంతకులకు చెప్పింది. దీంతో.. కోపోద్రిక్తులైన దుండగులు ఆమె కొడుకును చంపేశారు.
వాలెంటైన్స్ డే, దానితో పాటు శీతాకాలం.. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ చేసుకోవాలని, కాస్త మద్యం సేవించాలనే కోరిక కలగవచ్చు. మీ భాగస్వామితో సరదాగా గడపడానికి సన్నాహాలు చేయవచ్చు. అయితే ఆల్కహాల్‌తో పాటు మన ఆరోగ్యానికి హాని కలిగించే కొన్ని ఆహార పదార్థాలను మనం చాలాసార్లు ఎంచుకుంటాము. కాబట్టి ఆల్కహాల్ తీసుకునేటప్పుడు మనం ఏయే ఫుడ్స్‌ను తీసుకోకూడదో తెలుసుకుందాం..
Man Sets Wife On Fire: మద్యం తాగుతుండగా భార్యభర్తల మధ్య గొడవ హత్యకు దారి తీసింది. మలేషియాకు చెందిన ఓ వ్యక్తి మద్యం తాగుతున్న సమయంలో భార్య అతడితో వాగ్వాదానికి దిగింది. గొడవ తీవ్రం కావడంతో సదరు వ్యక్తి తన భార్యపై పెట్రోల్ పోసి నిప్పటించాడు.
చలికాలంలో శరీరాన్ని వేడిగా ఉంచేందుకు మధ్యాన్ని కూడా కొందరు సేవిస్తారు.. అలా తాగడం వల్ల ఒంట్లో వేడి పెరగడం ఏమో గానీ.. అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఎక్కువగా తాగితే గుండె జబ్బుల బారిన పడే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.. ఇంకా ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఈ చలికాలంలో ఆల్కహాల్ తాగడం వల్ల శరీరంలోని అంతర్గత ఉష్ణోగ్రత మరింతగా పడిపోవడం వల్ల…
Alcohol: సాధారణంగా ఆల్కాహాల్ తాగితే మత్తులో మంచి నిద్ర వస్తుందని అందరు అనుకుంటారు. అయితే అది నిజం కాదని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఆల్కహాల్‌ని వదులుకోవడం వల్ల నిద్ర నాణ్యత మెరుగవుతుందని కీలక అధ్యయనంలో వెల్లడైంది. సాయంత్రం పూట ఒకటి లేదా రెండు మద్యపానీయాలను తీసుకోవడం వల్ల నిద్ర నాణ్యత తగ్గుతుందని అధ్యయనాలు సూచిస్తు్న్నాయి. సాధారణంగా మద్యపానం తీసుకోవడం వల్ల త్వరగా నిద్రపోవడానికి సాయపడొచ్చని కానీ ఇది రాత్రంత నిద్రా భంగానికి కారణమవుతుందని తెలిపింది.
నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవడానికి, ప్రజలు తమ స్నేహితులతో కలిసి ప్రయాణించడానికి లేదా పార్టీ చేసుకోవడానికి ఇష్టపడతారు. ఆల్కహాల్ ఆరోగ్యానికి ఎంత హానికరమో తెలిసినప్పటికీ, చాలా మంది దానిని తమ వేడుకల్లో భాగం చేసుకోవడానికి ఇష్టపడతారు, కానీ దాని వల్ల కలిగే హ్యాంగోవర్ మీ నూతన సంవత్సరాన్ని పాడు చేస్తుంది. హ్యాంగోవర్‌ను ఎలా వదిలించుకోవచ్చో తెలుసుకోండి.