చలికాలంలో శరీరాన్ని వేడిగా ఉంచేందుకు మధ్యాన్ని కూడా కొందరు సేవిస్తారు.. అలా తాగడం వల్ల ఒంట్లో వేడి పెరగడం ఏమో గానీ.. అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఎక్కువగా తాగితే గుండె జబ్బుల బారిన పడే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.. ఇంకా ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఈ చలికాలంలో ఆల్కహాల్ తాగడం వల్ల శరీరంలోని అంతర్గత ఉష్ణోగ్రత మరింతగా పడిపోవడం వల్ల రక్తనాళాలు సంకోచించడం, కుంచించుకుపోవడం వల్ల రక్తప్రసరణ పెరిగి రక్తపోటు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఆల్కహాల్ కారణంగా చలికి రక్తం గడ్డకట్టడం జరుగుతుంది.. అంతేకాదు గుండెకు ముప్పు వాటిల్లే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు..
మద్యపానం శరీరాన్ని వేడి చేస్తుందని ప్రజలు నమ్ముతారు. అందుకే ప్రజలు శీతాకాలంలో ఎక్కువ మద్యం తీసుకోవడం ప్రారంభిస్తారు. అయితే ఆల్కహాల్ కొంత సమయం పాటు శరీరాన్ని వెచ్చగా ఉంచినా, ఆ తర్వాత ఒక్కసారిగా శరీరం చల్లబడిపోవడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదాలు కూడా ఉన్నాయి..
వృద్ధులు చలికాలంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.. చలికి తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది..
చలికాలంలో గుండె పోటు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.. శరీర ఉష్ణోగ్రతను సాధారణంగా ఉంచడానికి ప్రయత్నించండి. దీని కోసం మీ తలపై టోపీని, మీ చేతులకు, పాదాలకు సాక్స్‌తో కప్పబడిన చేతి తొడుగులు ఉంచండి. చలికాలంలో సాధారణ నీటికి బదులుగా గొరువెచ్చని నీటిని మాత్రమే తాగండి… ఒత్తిడికి గురి కాకుండా ఉండాలి.. ఇంట్లోనే వ్యాయామాలు చేయడం మంచిది.. శారీరక శ్రమను పెంచాలి.. అప్పుడే ఈ ప్రమాదం నుంచి బయట పడవచ్చు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.