Alcohol Affects: చాలామంది మానసిక ఉల్లాసం, ఆనందం కోసం మద్యం సేవిస్తుంటారు. ఆల్కహాల్‌ను మితంగా తీసుకున్నప్పుడు మెదడులో డోపమైన్, ఎండార్ఫిన్ వంటి హార్మోన్లు విడుదలై తాత్కాలికంగా హుషారు, ఆనందం కలుగుతుంది. అయితే తినేదైనా, తాగేదైనా పరిమితి మించితే సమస్యలు తప్పవు. ఆల్కహాల్ విషయంలో ఈ జాగ్రత్త మరింత అవసరం. ఎందుకంటే అతిగా మద్యం తీసుకుంటే మెదడులో క్రియాశీలత తగ్గిపోతుంది. నాడులు దెబ్బతింటాయి, గుండె కొట్టుకునే వేగం తగ్గుతుంది, శ్వాస కూడా నెమ్మదిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇది ప్రాణాంతకంగా…
Alcohol and Weight Gain: మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని మద్యం సీసాపై హెచ్చరిక రాసి ఉంటుంది. ఎలా హానికరమో ఇప్పటికే అనేక అధ్యయనాలు వెల్లడించాయి. ఇక తరచూ తాగే వారిలో చాలా మందికి లివర్ సమస్యలు వచ్చి తీవ్రస్థాయికి చేరి మరణించిన కేసులు కూడా ఉన్నాయి. మద్యపానం వల్ల దీర్ఘకాలంలో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Alcohol: ప్రస్తుతం ఆడ, మగ తేడాలేకుండా మద్యం తాగుతున్నారు. కొందరు ఉల్లసం కోసం తాగితే.. మరి కొందరూ ఉద్యమంలా తాగుతుంటారు. యువత ఎక్కువగా మద్యానికి బానిసలుగా మారుతున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మొదట ఏదో అలా ఉల్లాసం కోసం తాగి.. తరువాత దానికి బానిసలుగా మారుతున్నారు. ఇలా అలవాటైన కొందరూ రోజూ తాగుతూనే ఉంటారు.