Alcohol and Weight Gain: మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని మద్యం సీసాపై హెచ్చరిక రాసి ఉంటుంది. ఎలా హానికరమో ఇప్పటికే అనేక అధ్యయనాలు వెల్లడించాయి. ఇక తరచూ తాగే వారిలో చాలా మందికి లివర్ సమస్యలు వచ్చి తీవ్రస్థాయికి చేరి మరణించిన కేసులు కూడా ఉన్నాయి. మద్యపానం వల్ల దీర్ఘకాలంలో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినా కొందరు మానరు. అంతే కాదు.. మన దేశంలో మద్యానికి కష్టానికి అనుసంధానం ఉంది. పొదస్తమానం కష్టం చేసి సాయంత్రానికి ఓ పెగ్గు వేస్తే సుఖంగా నిద్ర పడుతుందని నమ్ముతుంటారు. అయితే.. తాజాగా ఓ అధ్యయనంలో సంచలన విషయం బయటపడింది. అధిక బరువు ఉన్నావాళ్లు మద్యం తీసుకోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయట.
READ MORE: OG : ఆ హీరోయిన్ ను నెత్తిన పెట్టుకుంటున్న పవన్ ఫ్యాన్స్.. ఎందుకంటే..?
బరువుకీ.. మద్యం తాగడానికి ఏంటి సంబంధం అనే అనుమానం కలుగుతోందా? ఈ రెండింటికీ మధ్య సంబంధం కచ్చితంగా ఉందని చెబుతున్నారు నిపుణులు. మీరు ఉండాల్సిన బరువు కన్నా ఎక్కువగా ఉంటే.. మద్యానికి దూరంగా ఉండటమే మంచిదని సూచిస్తున్నారు. ఈ మద్యం కారణంగా మీరు మరింత బరువు పెరిగే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. చాలా మంది ఆల్కహాల్‌లో కేలరీలు లేవని అనుకుంటూ ఉంటారు. దీంతో అది బ్యాలెన్స్ చేయడానికి వేరే ఆహారం తీసుకుంటారు. అయితే.. మీకు తెలియని విషయం ఏమిటంటే.. ఆల్కహాల్‌లో సైతం కేలరీలు ఎక్కువగా ఉంటాయి. బీరులో 150 కేలరీలు ఉంటాయి. హార్డ్ డ్రింక్స్‌లో చక్కెర శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. అంతేకాకుండా చాలా మందికి మద్యం తర్వాత.. తీపి పదార్థాలు తినాలనే కోరిక ఎక్కువగా కలుగుతుంది. దీంతో అవి తినడం వల్ల మరింత బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే వయసుకు మించి బరువు ఉన్న వాళ్లు మద్యం జోలికి వెళ్లకపోవడమే మంచిది.
READ MORE: Heart Attack: పెరుగుతున్న గుండెపోటు కేసులు.. ఈ ఒక్క ట్యాబ్లెట్ మీ దగ్గర ఉంచుకోండి..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.