Alcohol: రోజుకు రెండు పెగ్గుల మద్యం తాగితే మంచిదేనా? వైద్యులు ఏమంటున్నారు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Alcohol: ప్రస్తుతం ఆడ, మగ తేడాలేకుండా మద్యం తాగుతున్నారు. కొందరు ఉల్లసం కోసం తాగితే.. మరి కొందరు ఉద్యమంలా తాగుతుంటారు. యువత ఎక్కువగా మద్యానికి బానిసలుగా మారుతున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మొదట ఏదో అలా ఉల్లాసం కోసం తాగి.. తరువాత దానికి బానిసలుగా మారుతున్నారు. ఇలా అలవాటైన కొందరు రోజూ తాగుతూనే ఉంటారు. ఇలా డేలీ ఆల్కహాల్ తీసుకునే వారిలో కొందరు తెలివిగా రోజూ కొంత మోతాదులో(ఒకటి లేదా రెండు పెగ్గులు) మద్యం తీసుకుంటే మంచిదేనని వారిస్తుంటారు. ఈ అంశంపై వైద్యులు ఏం చెబుతున్నారు? నిజంగా రోజుకు రెండు పెగ్గులు మద్యం తాగితే మంచిదేనా? అనే ప్రశ్నలకు సమాధానాలను ఇప్పుడు తెలుసుకుందాం..
READ MORE: Akashteer India: భారతదేశానికి రక్షణగా ఆకాష్టీర్.. శత్రుదేశాలకు వణుకే..
Also Read
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
- Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
- How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
ఆల్కహాల్ ఎక్కువ లేదా తక్కువ తాగినా దాని వల్ల ఆరోగ్యానికి ఎటువంటి ప్రయోజనాలు ఉండవని వైద్యులు అంటున్నారు. మీరు కొద్దిగా మద్యం తాగినా అది మీ గుండెను బలహీనపరుస్తుందని వెల్లడించారు. ఇది రక్తపోటును పెంచుతుంది. ఫ్యాటీ లివర్ కు కారణమవుతుంది. లివర్ సిర్రోసిస్, లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ వంటి తీవ్రమైన పరిస్థితులకు దారితీస్తుంది. ఒక్కసారి మద్యానికి బానిసైతే మానసిక ఆందోళనలు, ఒత్తిడి , డిప్రెషన్ వంటి సమస్యలు తలెత్తుతాయి. అతిగా తాగేవారికి శరీరం, మెదడుపై అదుపు తప్పుతుంది. మందు బాబులే ప్రపంచవ్యాప్తంగా యాక్సిడెంట్లకు కారణమవుతున్నారని వైద్యులు చెబుతున్నారు.
READ MORE: Peter Navarro: బ్రిక్స్‌పై విషం చిమ్మిన ట్రంప్ సలహాదారు.. రక్త పిశాచి అంటూ పోస్ట్
వాస్తవానికి.. ఆల్కహాల్ తీసుకున్నప్పుడు దానిలోని ఇథనాల్ ఆహార నాళంలోకి వేగంగా చేరుతుంది. తరువాత కాలేయానికి చేరుకుంటుంది. ఆల్కహాల్ డీహైడ్రోజినీస్ (ఏడీహెచ్) అనే ఎంజైమ్‌ల ద్వారా జీవక్రియలను నిర్వహించడంలో కాలేయం కీలకమైంది. మద్యం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎంజైమ్ యాక్టివిటీ పెరిగి కాలేయం మీద తీవ్ర ప్రభావం పడుతుంది. ఇథనాల్ జీవక్రియలు అధికం కావడం వల్ల కాలేయంలోని కణాలు దెబ్బతింటాయి. వీటివల్ల పొట్టలో మంట ఏర్పడవచ్చు. అది ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డెవలప్ కావడానికి దారితీస్తుంది. ఇది మరింత తీవ్రమైతే ఆల్కహాలిక్ హెపటైటిస్ లేదా సిర్రోసిస్‌కు కారణమవుతుంది.
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
-
Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
-
CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
-
Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
-
Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!