Alcohol Addiction: మద్యం.. మనుషులను కిరాతకులుగా మార్చేస్తోంది. కొంత మందికి మద్యం మత్తులో తాము ఏం చేస్తున్నారో కూడా తెలియడం లేదు. సొంతవాళ్లు.. పరాయి వాళ్లు అని తేడా లేకుండా విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు. తెలంగాణలో మద్యం మత్తులో సొంత వారినే ఇద్దరు వ్యక్తులు కడతేర్చారు. కేవలం మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదన్న కారణంగా ఇద్దరి ఉసురు తీశారు. రంగారెడ్డి జిల్లా, ఖమ్మం జిల్లాలో జరిగిన వేర్వేరు ఘటనలు స్థానికంగా కలకలం రేపాయి. అలాంటి వారు మద్యం కొనాలంటే…
Tragedy: మద్యానికి బానిసైన కన్నతల్లి ముక్కు పచ్చలారని కన్న కూతురినే కడతేర్చింది. అభం శుభం తెలియని బోసి నవ్వుల చిన్నారిని దుప్పటి కప్పి గొంతు నులిమి చంపేసింది. హృదయాన్ని కలిచివేసే ఈ సంఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. ఇక్కడ చూడండి.. ఇక్కడ బెడ్‌పై తాపీగా కూర్చున్న మహిళ పేరు రమ్య. ఈమెకు నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం గోనుగొప్పులకు చెందిన గంగోని మల్లేష్‌తో 2 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఓ ఆడబిడ్డ జన్మించింది. ప్రస్తుతం అమ్మాయి…
భర్తలను భార్యలు మట్టుబెడుతున్న అనేక ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ ప్రరిడిలో దారుణ ఘటన చోటు చేసుకుంది.. బండరాయితో తలపై మోది భర్తను హత్య చేసింది భార్య. భర్త మద్యానికి బానిసై తరచూ తనను వేధిస్తున్నాడని భార్య ఆరోపించింది.
మద్యం మత్తులో ఓ యువతి హంగామా సృష్టించి కటకటాల పాలైంది. ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం కోర్బాలో జిల్లాలో చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి పాష్ పామ్ మాల్ ప్రాంతంలో ఉన్న ఓఎన్‌సీ బార్ వెలుపల పెద్ద ఎత్తున గొడవ జరిగింది. మద్యం మత్తులో ఉన్న యువకులు, యువతుల బృందం బహిరంగ ప్రదేశంలో గొడవ సృష్టించింది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. వీళ్లు రాత్రి ఆలస్యంగా బార్ నుంచి బయటకు వచ్చారు. అనంతరం తమలో తాము గొడవ పడటం…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం న్యూ గొల్లగూడెలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తుకు బానిసై డబ్బులు ఇవ్వమని వేధిస్తున్న కొడుకును, తల్లే హత్య చేసిన సంఘటన కలకలం రేపుతోంది. కొడుకు రాజ్ కుమార్ వేధింపులు తట్టుకోలేక తల్లి దూడమ్మ సంచలన నిర్ణయం తీసుకుంది. కొడుకును కాళ్లు కట్టేసి, కొట్టి ఉరివేసి హత్య చేసింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లక్ష్మీదేవిపల్లి ఎస్సై రమణారెడ్డి ఆధ్వర్యంలో విచారణ…
ఇంటి ముందు నిద్రిస్తున్న కొడుకును ఇనుప రాడ్డుతో కొట్టి హత్యకు ఒడిగట్టింది తల్లి హత్యకు భార్య కూడా సహకరించడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. మొదట అనుమానాస్పద మృతిగా వందతులు వచ్చినా.. దారుణ హత్య చేశారని పుకార్లు వినిపించాయి. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం హన్మాపూర్ గ్రామంలో బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన బక్కని వెంకటేష్ వ్యవసాయం చేస్తూ జీవించేవాడు. తల్లి భార్య ఇద్దరు పిల్లలతో కలిసి ఉండేవాడు. మంగళవారం రాత్రి ఇంటి…