ఈ మధ్య కాలంలో విమాన ప్రమాదాలతోపాటు.. హెలికాప్టర్ ప్రమాదాలు కూడా అక్కడక్కడా జరుగుతున్నాయి. ఈ మధ్య జరిగిన విమాన ప్రమాదాల్లో మరణాలు సంభవించకపోయినప్పటికీ.. గాయాలపాలవుతున్న వారు ఉంటున్నారు.
ఢిల్లీ నుంచి శాని ఫ్రాన్సిస్కోకు బయలుదేరిన విమానం రష్యాలోని మగడాన్‌లో అత్యవసరంగా ల్యాడ్ అయింది. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో అత్యవసరంగా మగడాన్‌లో ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని ఎయిరిండియా ప్రకటించింది.
సాధారణంగా ప్రజలు విలాసవంతమైన జీవితం గడపాలని కోరుకుంటారు. విలాసవంతమైన భవనాల్లో ఉండాలని.. ఖరీదైన వస్తువులు వాడాలని భావిస్తుంటారు. ఏ బాదర బందీ లేకుండా విలాసంగా జీవితం సాగిపోతే బాగుంటుందని భావించే వారు ఎక్కువ మంది ఉంటారు.
కస్టమ్స్ విభాగానికి చెందిన ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ చెన్నై విమానాశ్రయంలో 56 లక్షల విలువ చేసే విదేశీ కరెన్సీని సిఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది సీజ్ చేసింది. సింగపూర్ వెళ్లేందుకు చెన్నై ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న ఇద్దరి ప్రయాణీకుల లగేజ్ బ్యాగ్ లను సిఐఎస్ఎఫ్ స్కానింగ్ చేయగా షాక్ కు గురయ్యారు.
అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా… ఏదో విధంగా విదేశాాల నుంచి అక్రమ బంగారం దేశానికి చేరుతూనే ఉంది. అక్రమ బంగార రవాణాలకు ఎయిర్ పోర్టులు వేదిక అవుతున్నాయి. ఇటీవల కాలంలో ఇండియాలోని పలు విమానాశ్రయాల్లో వరసగా బంగారం పట్టుబడుతోంది. తాజాగా కర్ణాటక బెంగళూర్, తమిళనాడు చెన్నై, ట్రిచి ఎయిర్ పోర్టుల్లో అక్రమ బంగారం పట్టుబడింది. బెంగళూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు అధికారులు. దుబాయ్ నుంచి వస్తున్న ప్రయాణికుల వద్ద రూ. 1.44 కోట్ల విలువ…
ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసి కోట్లాది రూపాయాలు వసూలు చేశారన్న అభియోగాలు ఎదుర్కొంటున్న తమిళనాడు మాజీ మంత్రి, అన్నాడీఎంకే సీనియర్ నేత రాజేంద్ర బాలాజీ కోసం పోలీసుల వేట కొనసాగుతూనే ఉంది.. మాజీ మంత్రి కోసం ఇప్పటికే రంగంలోకి దిగాయి పోలీసు ప్రత్యేక బృందాలు.. దాదాపు వారం రోజులుగా గాలింపు చర్యలు ముమ్మరం చేసినా మంత్రి జాడ దొరకడం లేదు.. దీంతో.. ఆయన విదేశాలకు పారిపోయే అవకాశం కూడా లేకుండా చర్యలు చేపట్టారు.. అన్ని ఎయిర్‌పోర్ట్‌లకు…
ఇప్పటికే అన్ని సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్‌పరం చేస్తుందనే విమర్శలు ఉన్నాయి.. క్రమంగా కొన్ని సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తూ కేంద్రం చేతులు దులుపుకుంటుందని.. లాభాలు వచ్చే అవకాశం ఉన్న సంస్థలే కాదు.. లాభాల్లో ఉన్న సంస్థలను కూడా ప్రైవేట్‌పరం చేస్తుందని విమర్శలు లేకపోలేదు.. అయితే, మరో 25 ఎయిర్‌పోర్టులను కూడా ప్రైవేటీకరించేందుకు సిద్ధమవుతోంది నరేంద్ర మోడీ సర్కార్.. ఈ విషయాన్ని కేంద్ర పౌర విమానయానశాఖ సహాయ మంత్రి వీకే సింగ్ వెల్లడించారు.. రానున్న ఐదేళ్లలో మరో…
ఒమిక్రాన్ ప్రపంచాన్ని భయాందోళనలకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వేరియంట్ కారణంగా చాలా దేశాలు ట్రావెల్ బ్యాన్ ను విధిస్తున్నాయి. ఇజ్రాయిల్ ఏకంగా సరిహద్దులను మూసివేసింది. కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో అన్ని దేశాలు అప్రమత్తం అవుతున్నాయి. ఒమిక్రాన్ రిస్క్ ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్ పోర్టులో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆర్టీపీసీఆర్ టెస్టులు తప్పని సరిగా చేయించుకోవాలి. పరీక్ష చేయించుకోని రిజల్ట్ వచ్చే వరకు ఎయిర్‌పోర్ట్‌లోనే వేచి ఉండాలని ఆంక్షలు విధించారు.…
తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులకు సంబంధించిన స్టేటస్‌ను మంగళవారం నాడు రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. టీఆర్ఎస్ ఎంపీ సురేష్‌రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర విమానాయానశాఖ మంత్రి వీకే సింగ్ సమాధానం ఇచ్చారు. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ, వరంగల్ జిల్లా మామునూరు, పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్, ఆదిలాబాద్‌లో, మహబూబ్‌నగర్ జిల్లాలో మూడు బ్రౌన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించినట్లు కేంద్ర మంత్రి వీకే సింగ్ వెల్లడించారు. Read Also:…
ఒమిక్రాన్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం విదేశీ ప్రయాణికులపై ఫోకస్ పెట్టింది. సౌత్ ఆఫ్రికా, బోట్స్వానా, హంగ్‌కాంగ్ నుంచి వస్తున్న వారి పై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. 12 దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించింది. త్వరలోనే విజయవాడలో జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ అందుబాటులోకి తెస్తామన్నారు. విదేశాల నుంచి వస్తున్న వారిలో పాస్‌పోర్ట్‌లో ఏపీ అడ్రస్ ఉన్న వారిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు అధికారులు. ప్రస్తుతం ఏపీలో రికవరీ…