కరోనా వైరస్ కి పుట్టినిల్లయిన చైనాలో మళ్ళీ ఆ మహమ్మారి తన ప్రతాపం చూపిస్తోంది. మిగతా దేశాల్లో ఆంక్షలు సడలించి అన్నిటికీ పర్మిషన్లు ఇస్తున్నాయి. కానీ, చైనాలో మాత్రం మళ్ళీ వైరస్ కట్టడికి చర్యలు చేపడుతున్నారు. చైనా రాజధాని బీజింగ్లో దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళినవారు తిరిగి వస్తే ఖచ్చితంగా కరోనా టెస్టులు చేయించుకోవాలంటున్నారు. వీలైతే ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని వైద్య అధికారులు ఆదేశించారు. కొవిడ్ కేసులను సున్నా స్థాయికి పరిమితం చేసేందుకు ఈ మేరకు చర్యలు…
వివిధ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. దేశంలో 13 ఎయిర్‌పోర్టులను ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. కేంద్రం అమ్మేయాలని భావిస్తున్న 13 ఎయిర్‌పోర్టుల్లో 6 పెద్దవి, 7 చిన్నవి ఉన్నాయి. పెద్ద విమానాశ్రయాల జాబితాలో అమృత్ సర్, భువనేశ్వర్, ఇండోర్, రాయ్‌పూర్, తిరుచ్చి, వారణాసి ఉన్నాయి. చిన్న ఎయిర్‌పోర్టుల జాబితాలో సేలం (తమిళనాడు), జలగాం (ఛత్తీస్‌గఢ్),…
వర్షాలతో రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి.. వాహనదారులకు రోడ్లు నరకపాయంగా మారిపోయాయి.. ఏపీ ప్రభుత్వంపై ఈ వ్యవహారంలో విమర్శలు కూడా వెల్లువిత్తాయి.. ఈ నేపథ్యంలో రోడ్లు బాగు చేయడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. రహదారులు, ఓడరేవులు, విమానాశ్రయాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఏపీ సీఎం.. ఈ సమావేశానికి మంత్రులు పెద్దిరెడ్డి, శంకర్‌నారాయణ, మేకపాటి గౌతంరెడ్డి.. సంబంధిత అధికారులు హాజరయ్యారు.. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. అక్టోబర్ మాసానికల్లా వర్షాలు…
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ఎయిర్ పోర్టుల టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ తుది రిపోర్టులు కేంద్రం నుంచి అందాయి. మొత్తం ఆరింటిలో మూడు మాత్రమే పూర్తిస్థాయి ఎయిర్ పోర్టుల నిర్మాణం, పెద్ద విమానాల రాకపోకలకు అనుకూలమని, మరో మూడు అందుకు అనుకూలంగా లేవని ఎయిర్ పోర్టుల అథారిటీ తేల్చింది. తెలంగాణాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఎయిర్ పోర్టుల ఏర్పాటు, విమాన రాకపోకల సాధ్యాసాధ్యాలు, వాటివల్ల కలిగే లాభనష్టాలను భారత విమానయాన సంస్థ బేరీజు వేసింది. మొత్తం ఆరింటిలో…
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఏపీలో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. తాజాగా మరికొన్ని ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఈరోజు నుంచి ఆంధ్రప్రదేశ్ లోని గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ఆంక్షలను కఠినంగా అమలు చేయబోతున్నారు. ఎయిర్ పోర్ట్ ఆవరణలోకి ప్రయాణికులకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రయాణికుడితో పాటుగా డ్రైవర్ కు మాత్రమే ఎయిర్ పోర్ట్ ఆవరణలోకి అనుమతి ఉంటుంది. వీడ్కోలు పలికేందుకు వచ్చే బంధువులను ప్రాధాన ద్వారం వద్దే నిలిపివేయనున్నారు. …