విమానాలు ఆలస్యమై ప్రయాణికులకు అసౌకర్యం కలిగించే సంఘటనలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఎయిరిండియాకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. గురువారం (మే 30) దేశ రాజధాని ఢిల్లీ నుండి బయలుదేరాల్సిన ఢిల్లీ-శాన్ ఫ్రాన్సిస్కో విమానం కొన్ని కారణాల వల్ల 24 గంటలు ఆలస్యమైంది. ఈ క్రమంలో డీజీసీఏ ఈ చర్య తీసుకుంది.
ఎయిర్ పోర్టు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విజయవాడలోని గన్నవరం విమానాశ్రయంలో ప్రయాణికులకు వింత అనుభవం ఎదురైంది. ఎయిర్ ఇండియాకు చెందిన విమానం శనివారం గన్నవరం నుంచి బెంగళూరుకు వెళ్లింది.
Air India Flight Bomb: ఎయిర్ ఇండియా విమానంలో టిష్యూ పేపర్‌పై రాసున్న నోట్ కలకలం రేపింది. టిష్యూ పేపర్‌పై బాంబ్ అని రాసుండడంతో విమాన సిబ్బంది, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన అందరూ వెంటనే విమానం నుంచి కిందకు దిగారు. అయితే అనుమానాస్పద వస్తువులు ఏమీ విమానంలో లభ్యం కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో ఎయిర్ ఇండియా విమానం ఏడు గంటలు ఆలస్యంగా బయలుదేరింది. వివరాల్లోకి వెళితే… ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి…
మూకుమ్మడి సిక్ లీవ్స్ కారణంగా ఎయిరిండియా విమాన సర్వీసులు నిలిచిపోయాయి. 100కు పైగా విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 30 వరకు టెల్ అవీవ్‌కు వెళ్లే అన్ని విమాన సర్వీస్‌లను రద్దు చేసినట్లు ప్రకటించింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణ నెలకొన్న నేపథ్యంలో ఎయిరిండియా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.
Air India: మరోసారి నిబంధనల ఉల్లంఘనలో ఎయిర్ ఇండియాకు జరిమానా పడింది. ఇప్పటికే పలుమార్లు ఈ అగ్రశ్రేణి ఎయిర్ లైనర్‌కి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) జరిమానా విధించింది. తాజాగా ఫ్లైట్ డ్యూటీ టైమ్ రెగ్యులేషన్స్ (ఎఫ్‌డిటిఎల్), ఫెటీగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఎఫ్‌ఎంఎస్) నిబంధనలను ఉల్లంఘించినందుకు ఎయిర్ ఇండియాకు డీజీసీఏ రూ. 80 లక్షల భారీ జరిమానా విధించింది.
Air India Saftey Mudras: విమానం బయలుదేరే ముందు ఎయిర్ హోస్టెస్‌లు మైక్రోఫోన్ల ద్వారా ప్రయాణీకులకు భద్రతా సూచనలను అందిస్తారు. సీట్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలి..