ఈ మధ్యకాలంలో తరచుగా విమానాలకు సంబంధించిన అనేక విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం పరిపాటుగా మారింది. విమానంలో సాంకేతిక లోపాల కారణంగా మంటలు రావడం, లేకపోతే మిగతా సమస్యల వల్ల అనేక విషయాలు ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యాయి. తాజాగా ఓ విమానం ఇంజన్ లో చెలరేగిన మంటల కారణంగా ఎమర్జెన్సీ లాండింగ్ సంబంధించిన ఇన్సిడెంట్ కూడా వైరల్ గా మారింది. ఇకపోతే తాజాగా ముంబై విమానాశ్రయంలో కూడా ఓ పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ఈ విషయం సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..
IND vs PAK Clash: న్యూయార్క్‌లో బేస్ బాల్ ఆడేస్తున్న సచిన్, రవిశాస్త్రి.. వీడియో
ముంబై నగరంలోని విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఫ్లైట్ కు తృటిలో ప్రమాదం తప్పింది. ఈ సంఘటనలో ఒకే రన్వే పై నుండి ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ నూతన సమయంలో.. అదే సమయానికి అదే రన్వే పై ఇండిగో విమానం ల్యాండ్ అయింది. ఈ సమయంలో ఎయిర్ ఇండియా ప్రమాదం నుండి బయటపడిందని చెప్పవచ్చు. ఈ సంఘటన శనివారం నాడు చోటుచేసుకుంది.
Public Romance: పబ్లిక్ రోడ్డుపై కదిలే స్కూటర్ లో రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయిన జంట..
ఈ తప్పిదం సంబంధించి సమగ్ర విచారణకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆదేశించడంతోపాటు.. డ్యూటీలో ఉన్న ఈ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారిని తొలగించడం జరిగింది. ప్రస్తుతం సంఘటనకి రెండు విమానాలు దగ్గర దగ్గరగా ఉన్న సమయంలో ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Woh, this looks real close.@IndiGo6E lands just when @AirIndia was taking-off at Mumbai Airport.@DGCAIndia @FAANews @CSMIA_Official @MoCA_GoI pic.twitter.com/wRtFiTLKHE
— Tarun Shukla (@shukla_tarun) June 9, 2024