పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మే నెలలో ఆపరేషన్ సిందూర్ ప్రారంభించింది ఇండియన్ ఆర్మీ.. ఈ ఆపరేషన్ ద్వారా పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లోని ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం చేసింది.. భారత్ దెబ్బకు బెంబేలెత్తిన పాకిస్తాన్ కాళ్ల బేరానికి రాకతప్పలేదు. మరోవైపు, భారతే యుద్ధం వద్దని దిగువచ్చింది విజయం మనదే అంటూ.. ఆ దేశ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసింది.. అయితే, ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా జరిగిన దాడికి సంబంధించిన వీడియోను భారత వైమానిక దళం (ఐఏఎఫ్)…
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రం దేశ రక్షణలో కీలక భూమిక పోషిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇవాళ హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి డిఫెన్స్ ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, దేశ భద్రతకు తెలంగాణ రాష్ట్రం ఎంతో సహకారం అందిస్తోందని, ఇప్పటికే హైదరాబాద్ రక్షణ రంగానికి సంబంధించిన పరిశ్రమలు, విభాగాలకు కేంద్రంగా మారిందని వెల్లడించారు. తెలంగాణలో డిఫెన్స్ పరిశ్రమలు విస్తృతంగా అభివృద్ధి…
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆగ్రాలోని కగరౌల్‌లోని సోనిగా గ్రామ సమీపంలో ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన విమానం కూలిపోయింది. విమానం ఖాళీ పొలాల్లో పడిపోయింది. విమానం నేలపై పడిన వెంటనే మంటలు చెలరేగాయి. విమానంలో పైలట్‌తో సహా ఇద్దరు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడం విశేషం. ఇది ఎయిర్‌ఫోర్సుకు చెందిన మిగ్-29 జెట్ విమానంగా గుర్తించారు. పంజాబ్ అదంపూర్ నుంచి ఆగ్రా వెళ్తుండగా ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న ఎయిర్‌ఫోర్స్…
భారత వైమానిక దళం 25% కంటే ఎక్కువ అగ్నివీర్లను పర్మినెంట్ చేయగలదు. అయితే దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ప్రస్తుతం, అగ్నిపథ్ స్కీమ్ కింద ప్రతి బ్యాచ్ అగ్నివీర్‌లలో గరిష్టంగా 25% మాత్రమే శాశ్వతంగా మారే అవకాశం ఉందని వాయుసేన చీఫ్, ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ అన్నారు.
ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి మాట్లాడుతూ.. శిక్షణ పూర్తి చేసుకున్న ఫ్లైట్ పాయీలేట్ క్యాడెట్‌లకు అభినందనలు.. భారత వైమానిక దళంలోని వివిధ శాఖలో అంకిత భావంతో పని చేయాలి అన్నారు.
ప్రపంచంలోని కాలుష్య నగరాల్లో టాప్ స్థానంలో ఉన్న ఢిల్లీని తాజాగా దుమ్ము తుఫాను చుట్టిముట్టింది. ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిన రాజధాని నగరం ఇప్పుడు దుమ్ము తుఫానుతో భయాందోళనలు కలిగిస్తుంది.
సూరన్ కోట్ ప్రాంతంలో ఇటీవల వాయుసేన కాన్వాయ్ పై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఉగ్రవాదులు ఏకే అసాల్ట్ రైఫిల్స్‌తో పాటు అమెరికాలో తయారు చేసిన ఎం4 కార్బైన్‌లు, స్టీల్ బుల్లెట్‌లను కూడా ఉపయోగించి గరిష్ఠంగా ప్రాణనష్టం చేసేందుకు ప్రయత్నించినట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
Bhubaneswar : భారత వైమానిక దళంలో మహిళలకు ఛాన్స్ ఉండేది కాదు. కానీ లింగ పరిమితిని ఉల్లంఘించి ఓ మహిళ చరిత్ర సృష్టించింది. ఆమె పేరు మనీషా పాధి. ఇటీవలే మహిళా అసిస్టెంట్-డి-క్యాంప్ అంటే ADCగా నియమితులయ్యారు.