మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితిని అంచనా వేయాలని, భారత వైమానిక రక్షణ వ్యవస్థల పటిష్టతపై వైమానిక దళం దృష్టి పెట్టాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం టాప్ కమాండర్లను కోరారు.
వైమానిక దళానికి చెందిన మిగ్-21 విమానం రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌లో కూలిపోయింది. భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 సోమవారం రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ జిల్లాలో కూలిపోయిందని, పైలట్ సురక్షితంగా ఉన్నారని రక్షణ వర్గాలు తెలిపాయి.
అగ్నిపథ్ పథకం ఇప్పుడు కాకరేపుతోంది.. ఓవైపు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు, బంద్‌లు కొనసాగుతుంటే.. మరోవైపు ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదన్నట్టుగా నోటిఫికేషన్లకు విడుదల చేస్తోంది కేంద్రం.. దేశవ్యాప్తంగా అగ్నిపథ్‌పై ఆందోళన నేపథ్యంలో ఇప్పటికే త్రివిధ దళాధిపతులతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమావేశం నిర్వహించగా.. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ రంగంలోకి దిగారు.. రేపు అనగా మంగళవారం త్రివిధ దళాధిపతులతో సమావేశం కాబోతున్నారు ప్రధాని మోడీ.. కర్ణాటక పర్యటనలో అగ్నిపథ్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేసిన ఆయన.. కొన్ని…
సీడీఎస్ బిపిన్ రావత్‌కు 17 తుపాకుల వందనం సమర్పిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. తుపాకుల వందనాల్లో అనేక రకాలు ఉన్నాయి. 21 తుపాకుల వందనం, 19 తుపాకుల వందనం, 17 తుపాకుల వందనం వంటివి అనేక రాకాలు ఉంటాయి. వివిధ సందర్బాలను బట్టి, గౌరవాన్ని బట్టి ఈ తుపాకుల వందనం ఉంటుంది. స్వాతంత్య్రదినోత్సవం, గణతంత్ర దినోత్సవంలో 21 తుపాకుల వందనాన్ని సమర్పిస్తారు. వీటి కోసం తుపాకులు లేదా శతఘ్నలను వినియోగిస్తారు. వివిధ దేశాలకు చెందిన అధ్యక్షులు మనదేశానికి…
తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తరువాత దూకుడుగా వ్యవహరిస్తోంది. వీలైనంత త్వరగా సొంత ముద్ర వేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే తాలిబన్లు సొంత ఎయిర్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధమయింది. ఆఫ్ఘన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తరువాత ఇతర మిలిటెండ్ సంస్థలు రెచ్చిపోతున్నాయి. వీటికి బుద్దిచెప్పేందుకు ల్యాండ్ పై నుంచి మాత్రమే కాకుండా ఎయిర్ స్ట్రైక్స్ చేస్తే ఆగడాలు తగ్గిపోతాయని తాలిబన్ ప్రభుత్వం అభిప్రాయపడింది. గతంలో ఆఫ్ఘన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేసిన సైనికులు, అధికారులు తిరిగి వస్తే…
ఎన్ని రికార్డులకు కొలువైన తెలంగాణలో పుట్టిన ఓ కుర్రోడు తనకంటూ మరో రికార్డు క్రియేట్ చేశాడు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సైనిక్ స్కూల్ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌ఎస్) లో విద్యానభ్యసిస్తున్న పి. అశోక్ (17) అనే విద్యార్థి చరిత్ర సృష్టించాడు. యూపీఎస్సీ నిర్వహించిన ప్రవేశ పరీక్షతో పాటు ఎస్‌ఎస్‌బీ ఇంటర్వూలో తన ప్రతిభ కనబరిచి ఉత్తీర్ణుడిగా నిలిచాడు. దీంతో నేషన్ డిఫెన్స్ అకాడమీక (ఎన్‌డీఏ)కు ఎంపికయ్యాడు. అంతేకాకుండా టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌ఎస్ నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు ఎంపికైనా తొలి క్యాడెట్‌గా…
భారత భూభాగంలోకి డ్రోన్లు చొచ్చుకు రావడం… దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. జమ్మూలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లోకి డ్రోన్లను పంపి… ఐఈడీలను జారవిడిచారు. అర్ధరాత్రి తర్వాత రెండు డ్రోన్లు రావడంతో… జవాన్లు వీటిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు వాయుసేన సిబ్బందికి గాయాలయ్యాయి.. వాయుసేన స్థావరంపై దాడి జరిగిన 24 గంటల్లోనే మరో సైనిక స్థావరం వద్ద డ్రోన్ల సంచరించడం ఆందోళనకు గురి చేస్తోంది. డ్రోన్ల దాడి తర్వాత… జమ్ములో హై అలర్ట్ ప్రకటించారు. పోలీసులు, జవాన్లు… ప్రతి…