Delhi Storm: ఢిల్లీలో దుమ్ము తుఫాన్.. నిలిచిన విమాన రాకపోకలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలోని కాలుష్య నగరాల్లో టాప్ స్థానంలో ఉన్న ఢిల్లీని తాజాగా దుమ్ము తుఫాను చుట్టిముట్టింది. ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిన రాజధాని నగరం ఇప్పుడు దుమ్ము తుఫానుతో భయాందోళనలు కలిగిస్తుంది. తీవ్రమైన దుమ్ము తుఫాను, బలమైన గాలులు దేశ రాజధానిని తాకడంతో ఢిల్లీ వాతావరణంలో పెను మార్పు సంభవించింది. శుక్రవారం దుమ్ము తుఫాను దేశరాజధాని ఢిల్లీ – ఎన్‌సీఆర్ ప్రాంతాన్ని కుదిపేసింది. ఇద్దరు మృతి చెందగా.. విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. దీంతో జనజీవనం స్తంభించింది.
READ MORE: MS Dhoni: స్టేడియంలోకి దూసుకొచ్చిన ధోని అభిమాని.. ఆటపట్టించిన ఎంఎస్‌డీ
Also Read
- High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
- Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
- UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
- How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
ఒక్కసారిగా ఈదురు గాలులు వీయడంతో చెట్లు కూలాయంటూ.. 152 కాల్స్ వచ్చినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ తుఫాను కారణంగా చాలా ప్రాంతాల్లో విద్యుత్ నిలిచిపోయింది. ఉరుములు, ఈదురు గాలులకు నగరంలో ట్రాఫిక్‌కు ఇబ్బందులు తలెత్తాయి. మరోవైపు విమాన రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీకి రాకపోకలు సాగించే సుమారు తొమ్మిది విమానాలను జైపూర్‌కు దారి మళ్లించారు. ఈదురు గాలులకు పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. చాలా భవనాలు దెబ్బతిన్నాయి. మరోవైపు దుమ్ము తుఫాను కారణంగా చెట్లు, గోడ కూలిన ఘటనల్లో సుమారు ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో 23 మంది గాయాలపాలైనట్లు అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. పలువురు సిబ్బంది శనివారం విరిగిన చెట్లు, భవనాల శిథిలాలను తొలగించారు.
తాజావార్తలు
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Manchu Vishnu: డీప్‌ఫేక్, పెయిడ్ ట్రోలింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
ట్రెండింగ్
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!