అక్కడ ఇచ్చే పెన్నుల కోసం ప్రతిఒక్కరు ఎంతగానో ఎదురు చూస్తారు. పరీక్షలు రాయబోయే విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా వీటి కోసం పోటీ పడతారు. పరీక్షలు వచ్చాయంటే విద్యార్థుల్లో భయం ఒక ఎత్తైతే.. తల్లిదండ్రుల ఆందోళన మరోఎత్తు. అయితే కొందరు తల్లిదండ్రులు, విద్యార్థులు మాత్రం ఓ పెన్ను కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అక్కడి నుంచి తీసుకొచ్చిన పెన్నుతో పరీక్షలు రాస్తే విజయం సొంతమట. అదే అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి పెన్నుల పండుగ. ఆ డీటెయిల్స్ ఏంటో…