తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ అన్నారు. మార్పు కోసం ఓటేయడానికి సిద్ధం అయ్యారని ఆయన పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి విజన్‌తోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని.. ఓఆర్‌ఆర్ ఆయన హయాంలోనే వచ్చిందన్నారు.
నారాయణఖేడ్ కాంగ్రెస్ టికెట్ లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. చివరి నిమిషంలో నారాయణఖేడ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మార్చింది. ఇటీవల మాజీ ఎమ్మెల్యే సురేశ్ షెట్కార్‌కు టికెట్‌ను ఖరారు చేసిన కాంగ్రెస్.. తాజాగా సంజీవ్‌రెడ్డికి ఇస్తున్నట్లు వెల్లడించింది.
రేపు మంథని నియోజకవర్గంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. హెలికాప్టర్‌లో రాహుల్ గాంధీ అంబట్‌పల్లికి చేరుకోనున్నారు. అంబట్‌పల్లిలో ఉదయం 7.30 గంటలకు నూతన గ్రామపంచాయతీ సమీపంలో మహిళా సదస్సులో రాహుల్ పాల్గొననున్నారు.
TS Congress: రెండో విడత ఎన్నికల ప్రచారానికి ప్రియాంక గాంధీ ఈరోజు తెలంగాణకు రానున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొల్లాపూర్, దేవరకద్రలో జరిగే బహిరంగ సభల్లో ఆమె పాల్గొంటారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడిది చివరలో జరుగనున్నాయి. అయితే, కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే కసరత్తు చేస్తుంది. ఎన్నికల షెడ్యూల్ కంటే చాలా ముందుగానే ఎమ్మెల్యేల అభ్యర్ధులను ప్రకటించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది.
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు హస్తం పార్టీ ప్లాన్ రెడీ చేస్తుంది. మరోసారి విజయం సాధించడం కోసం వ్యూహాలను రచించేందుకు ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో ఆ పార్టీ అగ్ర నేతలు ఇవాళ( గురువారం) భేటీ అయ్యారు. సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాజస్థాన్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి సుఖ్‌జిందర్ రణధవా, ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్…
Karnataka Elections: కర్ణాటక ఎన్నికల ఫలితాలు రేపు విడుదల కాబోతున్నాయి. రేపు మధ్యాహ్నం వరకు ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారనే విషయం తెలుస్తుంది.
టీపీసీసీ రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ అయ్యారు. రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాల వివరాలు తమతో చర్చించకుండా కార్యచరణ రూపొందిస్తారని మండి పడ్డారు.
కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ ఈరోజు జైపూర్‌లో తన సొంత ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని తన నిరసన నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. పార్టీ వ్యతిరేక చర్యకు దిగొద్దని హైకమాండ్ హెచ్చరించినా.. కాంగ్రెస్ పెద్దల ఆదేశాలన్ని పైలట్ ధిక్కరించారు.