Jagga Reddy: ఏఐసీసీ కంటే ఇక్కడ తోపులు ఎవరూ లేరని చేరికల సందర్భంగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, కోదండరెడ్డి వ్యాఖ్యానించారు. ఎవరు పార్టీలో చేరినా చేర్చుకుంటామన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్ని పార్టీలు అభ్యర్థుల వేటలో నిమగ్నమయ్యాయి. వైసీపీ, టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థుల జాబితాపై కసరత్తులు చేస్తున్నాయి. ఈ క్రమంలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల కోసం కాంగ్రెస్ పార్టీ.. విజయవాడ ఆంధ్ర భవన్‌లో దరఖాస్తులను స్వీకరిచింది. నేటితో కాంగ్రెస్ ధరఖాస్తుల పరశీలన ముగియనుంది. Also Read: Yarlagadda VenkatRao: యార్లగడ్డ ఉదారస్వభావం.. సొంత ఖర్చుతో కుట్టు మిషన్ల పంపిణీ.. బుధవారం…
ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా తనను విశ్వసించినందుకు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, కె.సి.వేణుగోపాల్ కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు వైఎస్ షర్మిల ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం అందించేలా.. పూర్తి నిబద్ధతతో, చిత్తశుద్ధితో నమ్మకంగా పని చేస్తానని హామీ ఇస్తున్నాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాణిక్కం ఠాకూర్ కి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాని అన్నారు.
వైఎస్ షర్మిలను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించినట్టు ఓ ప్రకటన విడుదల చేశారు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్.. ఇదే సమయంలో.. సోమవారం రోజు పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన గిడుగు రుద్రరాజును కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించినట్టు పేర్కొన్నారు.
2024 ఎన్నికలకు ముందు అంటే అధికారం కోసం కాంగ్రెస్ 'భారత్ జోడో న్యాయ యాత్ర' చేపట్టబోతోంది. కాంగ్రెస్ ఈ యాత్ర 6,700 కి.మీ. కంటే ఎక్కువ దూరాన్ని కవర్ చేస్తుంది. 110 జిల్లాలు, 100 లోక్‌సభ స్థానాలు, 337 అసెంబ్లీ స్థానాల్లో 67 రోజుల పాటు యాత్ర సాగనుంది.
కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌పై ఫోకస్ పెడుతోంది.. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో అధిష్టానంతో సమావేశం కానున్నారు ఏపీ నేతలు.. సుమారు 30 మంది ఏపీ కాంగ్రెస్ నేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.. తెలంగాణలో విజయం తర్వాత ఏపీ కాంగ్రెస్ పై రాహుల్ గాంధీ దృష్టి పెట్టారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జీగా పశ్చిమ బెంగాల్ సీనియర్ నేత దీపాదాస్ మున్షీని నియమించినట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ప్రస్తుత ఇన్‌చార్జీగా ఉన్న మాణిక్ రావ్ ఠాక్రేను తప్పిస్తూ శనివారం ఏఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్ సీనియర్ నేత దీపాదాస్ మున్షీని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్ సీనియర్ నేత ప్రియరంజన్ దాస్ మున్షీ సతీమణే దీపాదాస్ మున్షీ. కాగా ఇప్పటి వరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జీగా వ్యవహరిస్తూ…
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్ష ఇండియా కూటమి నేతల కీలక సమావేశం ఢిల్లీలో జరుగుతోంది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో అధికార బీజేపీని ఓడించడానికి అవసరమైన ఉమ్మడి ప్రచార వ్యూహాన్ని రూపొందించుకోవడం, భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు కూటమి ఎజెండాలో ప్రధాన అంశాలుగా ఉన్నాయి.
కాంగ్రెస్ పార్టీలో సీఎం ఎంపిక వ్యవహారం ఇంకా కొలిక్కిరాలేదు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వైపే పార్టీ హైకమాండ్ మొగ్గుచూపిందని.. ఆయన ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తారని తొలుత ప్రచారం జరిగింది. కానీ, అధికారిక ప్రకటన ఇప్పటి వరకు రాలేదు.. అయితే, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై పార్టీలో తీవ్ర సందిగ్ధత కొనసాగుతోంది.
Dk Sivakumar: డీకే శివకుమార్.. కర్ణాటక ఎన్నికల ఫలితాల సమయంలోనూ, అక్కడ రాజకీయ సంక్షోభం వచ్చినప్పుడల్లా ఎక్కువగా వినిపించే పేరు. గెలిచే అభ్యర్థులను జంప్ చేయడం కంటే సంక్షోభ సమయాల్లో పార్టీ ఎమ్మెల్యేలను కలిసి ఉంచడంలో ఆయన నిపుణుడు.