CWC Meeting: కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాధికార కమిటీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ( సీడబ్ల్యూసీ) గురువారం భేటీ కాబోతోంది. రేపు సాయంత్రం 5.30 నిమిషాలకు సోనియా అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతోంది. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ను ఖరారు చేసే అవకాశం ఉంది. దీంతో పాటు రేపు జరగబోయే సీడబ్ల్యూసీ మీటింగ్ లో అధిక ధరలకు వ్యతిరేకంగా ఆగస్టు 28న ఢిల్లీలో రాంలీలా మైదానంలో నిర్వహించబోతోన్న ర్యాలీ గురించి కూడా చర్చించనున్నారు.