అగ్నిపథ్ పథకంపై దేశంలో అగ్గి రాజుకుంది.. దేశవ్యాప్తంగా ఆందోళనలు, విధ్వంసాలతో అట్టుడికిపోయింది.. అగ్నిపథ్‌ను వెనక్కి తీసుకోవాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.. ఓవైపు నిరసనలు, ఆందోళనలు.. ఇలా దేశవ్యాప్తంగా ఏదో రూపంలో అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా కార్యాచరణ సాగుతూనే ఉంది. అయితే, కేంద్రం మాత్రం అగ్నిపథ్ విషయంలో వెనక్కి తగ్గడం లేదు.. ఈ విషయంలో మరో ముందుడు వేసింది నరేంద్ర మోడీ సర్కార్.. ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్ నియామకాలకు ముసాయిదా నోటిషికేషన్ జారీ చేసింది. ఎయిర్‌ఫోర్స్, నేవీలో కూడా అగ్నివీర్ నియామకాల కోసం తేదీలను ఖరారు చేసింది.. కేంద్రం ప్రకటించిన ప్రకారం రేపు అనగా ఈ నెల 21వ తేదీన ఎయిర్‌ఫోర్స్ రువీ అగ్నివీర్ నోటిఫికేషన్ రానుండగా.. 24వ తేదీన ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
Read Also: Kaithalapur Flyover : గ్రేటర్ ప్రజలకు శుభవార్త.. అందుబాటులోకి మరో ఫ్లైఓవర్
ఇక, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది ప్రభుత్వం.. జులైలో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. స్కీమ్‌కు సంబంధించి పూర్తి విధివిధాలను వెల్లడించింది. అంతే కాదు ఆర్మీలో అగ్నివీర్స్ ప్రత్యేకమైన ర్యాంక్కలిగి ఉంటారని పేర్కొంది.. ఇక, ఈ స్కీమ్‌కు సంబంధించిన విధివిధానాల విషయానికి వస్తే..
* త్రివిధ దళాలకు ఆన్‌లైన్ సెంట్రలైజ్డ్ విధానంలో ర్యాలీలు, క్యాంపస్ ఇంటర్వ్యూ తదితర మార్గాల్లో నాలుగేళ్ల కాలానికి నియామకాలు చేపట్టనున్నారు.
* అగ్నిపథ్ పథకంలో మొదటగా ఈ ఏడాది 46,000 నియామకాలు చేపట్టనున్నారు.. 90 రోజుల్లో ప్రక్రియ మొదలు కాబోతోంది.
* ఇండియన్ ఆర్మీలో పనిచేయాలంటే వయో పరిమితి 17.7–21 ఏళ్లుగా ఉండగా.. ఆరు నెలల శిక్షణ, మూడున్నరేళ్ల సర్వీసు ఉండనున్నాయి.
* ప్రస్తువం త్రివిధ దళాల్లో కొనసాగుతోన్న అర్హత ప్రమాణాలే వర్తింపజేయనున్నారు.
* ఆర్మీలో ఇప్పటి వరకు ప్రాంతాలు, కులాలవారీగా జరుగుతోన్న నియామకాలకు భిన్నంగా.. ఆలిండియా–ఆల్ క్లాస్ విధానంలో రిక్రూట్‌మెంట్ చేపట్టనున్నారు.
* ఇక, విధుల్లో చేరేవారిని అగ్నివీర్‌గా పిలవనున్నారు.. వీరికి ప్రత్యేక ర్యాంకులు ఇస్తారు.
* అగ్నివీర్స్‌కు మొదటి సంవత్సరం నెలకు రూ.30,000 వేతనం ఉండగా.. రూ.21 వేలు చేతికి వస్తుంది.. రూ.9,000 కార్పస్ నిధికి వెళ్లనుంది. ఇక, నాలుగో ఏడాదికి రూ.40,000 వేతనం అందించనున్నారు.
* నాలుగు సంవత్సరాల సర్వీసు పూర్తయ్యాక రూ.11.71 లక్షల సేవా నిధి ప్యాకేజీ అందించనున్నారు.. సర్వీసు కాల వ్యవధికి రూ.48 లక్షల ఉచిత జీవిత బీమా వర్తింపజేస్తారు. అయితే, గ్రాట్యుటీ, పెన్షన్ బెనిఫిట్స్ లాంటివి ఉండబోవు.
* నాలుగేళ్ల తర్వాత ప్రతిభ, ఖాళీల ఆధారంగా 25 శాతం మందిని శాశ్వత సర్వీసుకు తీసుకోనున్నారు. మిగతా వారికి రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు రంగ నియామకాల్లో ప్రాధాన్యం కల్పించనున్నారు.
* నాలుగేళ్ల తర్వాత మళ్లీ కేంద్రం చేర్చుకునే వారు 15 ఏళ్లు విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
* రెగ్యులర్సర్వీస్ వారికి 90 రోజులు సెలవులు ఉండగా.. సంవత్సరానికి 30 రోజులు అదనపు సెలవులు ఉంటాయి వైద్యుల సలహా ఆధారంగా మెడికల్ లీవ్ మంజూరు చేస్తారు.