వ్యాపారం ప్రమోషన్ కోసం తమ నెంబర్లను సోషల్ మీడియాతో పాటు ఎక్కడపడితే అక్కడ పెడితే ఇబ్బందులు ఎదుర్కొక తప్పవు.. ఒక వ్యాపారవేత్తకు ఇదే అనుభవం ఎదురయింది.. వ్యాపారవేత్తకు ఫోన్ చేసి వ్యాపార విషయాలు అడిగి చివరకు తక్కువ ధరికే బంగారం ఇప్పిస్తామని చెప్పి కోటి రూపాయలను కొట్టేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా చౌటుప్పల్‌కు చెందిన ఓ రియల్టర్ వ్యాపారాభివృద్ధి కోసం తన పేరు, ఫోన్ నెంబర్ కార్యాలయంపై రాసుకోవడమే శాపమైంది. అలా లభించిన ఫోన్ నెంబర్ ఆధారంగా…
చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శంకర్ నగర్ లో రాత్రి మహమ్మద్ మజీద్ ఆర్థిక ఇబ్బందులతో ఉరి వేసుకొని ఆత్మహత్య కు పాల్పడ్డారు. పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మద్యం మత్తులో విధుల్లో ఉన్న ఆ మార్చురీ సిబ్బంది రాజు రూ.1000 ఇస్తేనే మృతదేహాన్నీ తీసుకుంటానని పోలీసులకు, బాధిత బంధువులతో వాగ్వివాదానికి దిగిన విషయం తెలిసిందే. అందరూ కలిసి ఎంతగా నచ్చచెప్పే ప్రయత్నం చేసినా ససేమిరా అన్నాడు ఆప్రబుద్దుడు.…