ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల వశం అయిపోయింది.. ప్రస్తుత అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి పారిపోయాడు.. దీంతో ఆఫ్ఘన్‌లో తాలిబన్ల రాజ్యం వచ్చేసింది.. ఇక, కొత్త అధ్యక్షుడి ఎంపికపై దృష్టిసారించారు తాలిబన్లు.. ఈ క్రమంలో తాలిబన్ కోఫౌండర్ ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ పేరు తెరపైకి వచ్చింది.. ఆఫ్ఘన్ శాంతి చర్చల సమయంలో అత్యధికంగా అందరి నోళ్లలో నానినపేరు ఇది.. ఇంతకీ.. ఎవరీ ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్.. ఆయనకు తాలిబన్ సంస్థకు ఉన్న సంబంధం ఏంటి? తాలిబన్…
ఆఫ్ఘనిస్థాన్ పూర్తిగా తాలిబాన్లు హస్తగతమైంది. అధ్యక్షపదవికి రాజీనామా చేసిన అష్రఫ్ ఘనీ, కీలక బృందంతో కలిసి దేశం వెళ్లిపోయారు. తన నిష్క్రమణపై అష్రఫ్ ఘనీ ట్వీట్ చేశారు. తాలిబాన్లతో జరిగిన పోరాటంలో ఇప్పటికే అనేక మంది చనిపోయారని గుర్తు చేశారు. మరింత రక్తపాతం జరగకుండా అధికారం నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. తుపాకులు, కత్తులతో ఆఫ్ఘనిస్థాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లపై ప్రజల గౌరవం, శాంతిభద్రతల్ని కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు ఘనీ. అయితే, ఇలా అధికారంలోకి వచ్చిన పాలకులకు చట్టబద్దత…
కాబూల్ నుంచి 129 మంది భారతీయులు ఢిల్లీ చేరుకున్నారు. ఎయిర్ ఇండియా విమానంలో వీరంతా స్వదేశానికి తిరిగి వచ్చారు. ఆఫ్ఘన్‌లో చిక్కుకుపోయిన మన వాల్లను తీసుకొచ్చేందుకు ఢిల్లీ నుంచి ఎయిరిండియా విమానం వెళ్లింది. అయితే, విమానం బయలుదేరిన కొద్ది సేపటికే కాబూల్‌ను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నారని తెలియడంతో ఆందోళన నెలకొంది. అలాగే, కాబూల్ ఎయిర్ పోర్టులో దిగేందుకు అనుమతిచ్చేందుకు ATC అందుబాటులో లేకపోవడంతో మరో ఉత్కంఠకు తెరలేచింది. అదే సమయంలో శత్రువులకు లక్ష్యంగా మారకూడదనే ఉద్దేశంతో విమాన…
సినిమా వాళ్ళు సున్నిత మనస్కులు. చిన్న సంఘటన జరిగినా త్వరగా చెలించిపోతారు. కానీ అలాంటి సినిమా వాళ్ళే ఒక్కోసారి తమ ముందే అతి పెద్ద దారుణం జరిగినా స్పందించారు. ఆ కోవకు తాను చెందనని అంటున్నాడు అడివి శేష్. గత కొన్ని రోజులుగా ఆఫ్ఠనిస్థాన్ లో తాలిబన్లు చేస్తున్న దారుణ మారణ కాండను తెలియచేసే ఓ లేఖను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి… ఆ లేఖ తన హృదయాన్ని బ్రద్దలు చేసిందని పేర్కొన్నాడు అడివి శేష్.…
ఆఫ్ఘనిస్థాన్‌లో సంక్షోభంపై ప్రపంచ దేశాలు స్పందిస్తున్నాయి. ఇప్పటికే కాబూల్ ఎయిర్ పోర్టు నుంచి విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. అయితే, రక్షణ విమానాల కార్యకలాపాలు కొనసాగుతాయని నాటో అధికారులు ప్రకటించారు. మరోవైపు… ఆఫ్ఘనిస్థాన్ తాలిబాన్ల ఆధీనంలోకి వెళ్లడంపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. బలప్రయోగం అంతర్యుద్ధానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్. అలాగే, ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితులపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జన్సన్ స్పందించారు. అక్కడి సంక్షోభంపై సమీక్షిస్తున్నట్టు తెలిపారు. తాలిబాన్ల…
ఆప్ఘనిస్థాన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు తాలిబన్లు.. దేశ రాజధాని కాబూల్ సహా.. అన్ని ప్రధాన నగరాలను.. చివరకు అధ్యక్ష భవనాన్ని సైతం స్వాధీనం చేసుకున్నారు.. అక్కడ పార్టీ కూడా చేసుకున్నారు.. అయితే, ప్రజలు మాత్రం భయంతో వణికిపోతున్నారు.. కాబూల్‌లో ప్రధాన రహదారులు.. వాహనాలతో భారీ ట్రాఫిక్‌తో దర్శనమిస్తుండగా.. ఇక, ఎయిర్పోర్ట్ లో ప్రజల రద్దీ పెరిగిపోయింది.. పెద్ద ఎత్తున ప్రజలు ఎయిర్‌పోర్ట్‌లోకి దూసుకెళ్లారు.. విమానంలో ఎక్కితే చాలు అనే అతృత వారిలో కనిపిస్తోంది.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని…
ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల చేతిలోకి వెళ్లిపోయింది.. చాలా దేశాలు ఈ పరిణామాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి.. రాక్షస మూకల చేతుల్లోకి ఆఫ్ఘన్ వెళ్లిపోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.. ఈ తరుణంలో తాలిబన్లతో స్నేహానికి తాము సిద్ధమని చైనా ప్రకటిస్తే.. ఇక, పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. ఆఫ్ఘన్‌లో జరిగిన పరిణామాలను బానిస సంకెళ్లను తెంచుకోవడంగా అభివర్ణించారు ఇమ్రాన్.. ఇతరుల సంస్కృతిని ఆకళింపు చేసుకోవడంపై స్పందిస్తూ.. ఇమ్రాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లీష్‌ను ఓ మీడియంగా తీసుకోవడంపై…
ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్ల వశం అయిపోయింది.. ఎవరూ ఊహించని రేతిలో వేగంగా కాబూల్‌ను హస్తగతం చేసుకున్నారు తాలిబన్లు.. అయితే, ఇప్పుడు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఆఫ్ఘన్‌తో స్నేహనికి సిద్ధం అంటోంది డ్రాగన్ కంట్రీ.. ఆఫ్ఘనిస్థాన్‌లో జరుగుతున్న తాజా పరిణామాలపై స్పందించిన చైనా.. ఆ దేశాన్ని హస్తగతం చేసుకున్న తాలిబన్ ఫైటర్లతో స్నేహ సంబంధాలు కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది.. ఇక, ఆఫ్ఘన్ పొరుగు దేశమైన రష్యా మాత్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఆ దేశంలో…
ఎప్పుడైతే అమెరికా సేనలు తప్పుకుంటున్నట్టు ప్రకటించాయో అప్పటి నుంచి తాలిబన్లు ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు. వారాల వ్యవధిలోనే తాలిబన్లు ఆ దేశం మొత్తాన్ని ఆక్రమించుకున్నారు. ఆదివారం రోజున తాలిబన్లు కాబూల్ శివారు ప్రాంతానికి చేరుకోగా, సోమవారం నాడు కాబూల్‌లోకి వచ్చారు. అధ్యక్ష భవనంలోకి ప్రవేశించిన తరువాత తాలిబన్లు కీలక ప్రకటన చేశారు. యుద్ధం ముగిసిందని, ఆఫ్ఘన్ ప్రజలకు, ముజాహిదీన్లకు మంచిరోజులు వచ్చాయని అంతర్జాతీయ మీడియాతో తెలిపారు. శాంతియుతమైన పాలన అందిస్తామని చెప్పిన తాలిబన్ నేతలు, త్వరలోనే…
కాబూల్ లో ప్రస్తుతం పరిస్థితులు మరింత ఘోరంగా మారాయి. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని తాలిబన్లు ఆక్రమించుకున్నారు. వేగంగా అధికార మార్పిడి జరుగుతున్నది. అధికారంలోకి వచ్చిన తరువాత శాంతిని, అభివృద్దిని తీసుకొస్తామని తాలిబన్లు చెబుతున్నప్పటికీ ఎవరికి నమ్మకం కుదరడం లేదు. ఎందుకంటే, 1994 లో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు పాలనలోకి వచ్చిన సమయంలో కూడా ఇదే విధమైన హామీ ఇచ్చారు. కానీ, ఆ వెంటనే అరాచకాలు సృష్టించారు. వారి నాలుగేళ్ల పాలనలో ఆఫ్ఘన్ వాసులు ఘోరంగా దెబ్బతిన్నారు. ఇప్పుడు కూడా…