ఆఫ్గాన్‌లో పరిస్థితి చేయిజారిపోయింది. ఒక్కో నగరం తాలిబన్ల చెరలో చేరిపోతోంది. ఇప్పటికే 34 ప్రొవిన్షియల్ రాజధానుల్లో 10.. తాలిబన్ల వశమయ్యాయి. ఆ దేశంలోని 65 శాతం భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నారు. తాజాగా లోగర్ ప్రావిన్స్ ప్రాంతాన్ని కూడా ఆధీనంలోకి తీసుకున్నారు. కందహార్, హెరత్ నగరాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించిన గంటల్లోనే లోగర్ ప్రాంతాన్ని ఆక్రమించినట్లు ప్రకటించారు. తాలిబన్లు చేజిక్కించుకున్న లోగర్ ప్రావిన్స్… ఆ దేశ రాజధాని కాబూల్‌కి 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. అమెరికా, నాటో సేనలు…
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల ఆరాచకాలు, ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే సంహభాగం ప్రాంతాలను తాలిబన్ ఉగ్రవాదులు స్వాధీనం చేసుకున్నారు. త్వరలోనే కాబూల్‌ను కూడా తమ ఆధీనంలోకి తీసుకుంటామని చెబుతున్న తాలిబన్లు తాజాగా కాందహార్ నగరాన్ని సొంతం చేసుకున్నారు. రాజధాని కాబుల్ తరువాత రెండో పెద్ద నగరంతో పాటుగా, ఆర్ధికంగా, వాణిజ్యపరంగా అభివృద్ది చెందిన నగరం కావడంతో దీనిపైనే దృష్టి పెట్టారు తాలిబన్ ఉగ్రవాదులు. అంతేకాదు, తాలిబన్ ఏర్పాటుకు అంకురార్పణ జరిగింది కూడా కాందహార్ నగరంలోనే కావడంతో ఇది వారికి కీలకంగా…
తాలిబన్లకు, ఆఫ్ఘన్ సైన్యానికి మధ్య గత కొన్ని రోజులుగా భీకర పోరు జరుగుతున్నది. నాటో దళాలు, అమెరికా సైన్యం ఆఫ్ఘన్ నుంచి తప్పుకోవడంతో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే ఆ దేశంలోని కీలకమైన ప్రాంతాలను సొంతం చేసుకున్నారు. కాందహార్‌తో పాటు, మూడో అతిపెద్ద కీలక నగరమైన హెరాత్‌ను కూడా తాలిబన్లు తమ ఆదీనంలోకి తీసుకున్నారు. మరికొన్ని రోజుల్లో రాజధాని కాబుల్‌ను తాలిబన్లు స్వాదీనం చేసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. దీంతో ఆఫ్ఘన్ ప్రభుత్వం కీలక ప్రతిపాదనను తాలిబన్ నేతల ముందుకు…
క్రమంగా ఆఫ్ఘనిస్థాన్‌పై పట్టు సాధిస్తున్నారు తాలిబన్లు.. త్వరలోనే ఆఫ్ఘన్‌ను పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకుంటామని ముందుకు కదులుతున్న తాలిబన్ ఫైటర్లు.. దేశంలోని ఒక్కో ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు.. తాజాగా ఆఫ్ఘనిస్థాన్ బలగాలకు భారత్ బహుమతిగా ఇచ్చిన ఎంఐ-24 అటాక్ హెలికాప్టర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.. భారత్ ఇచ్చిన గిఫ్ట్‌ను తాము స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు తాలిబన్లు. ఆ హెలికాప్టర్ పక్కన తాలిబన్లు నిలబడి ఉన్న ఫొటోలు, వీడియోలను రిలీజ్ చేవారు.. అయితే, అది ఉపయోగించడానికి వీలు లేకుండా…
ఆఫ్ఘనిస్తాన్‌లో రోజురోజుకు తాలీబన్ ఉగ్రవాదుల దారుణాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే అనేక ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్న ఉగ్రవాదులు అక్కడి సామాన్య ప్రజలకు నరకం చూపిస్తున్నారు. చిన్నపిల్లలు, మహిళలకు రక్షణ లేకుండా పోయింది. అమెరికా, నాటో దళాలు ఆఫ్ఘన్ నుంచి తప్పుకోవడంతో ప్రభుత్వ దళాలకు, తాలీబన్లకు మధ్య పోరు జరుగుతున్నది. ఆఫ్ఘన్లో ఉన్న అమెరికా పౌరులు వెంటనే వెనక్కి వచ్చేయాలని, అక్కడ ఉండటం ఏమాత్రం సురక్షితం కాదని, ఒకవేళ టికెట్ కొనుగోలు చేసేందుకు డబ్బులు లేకుంటే రుణాలు అందిస్తామని…
గత కొంత కాలంగా తాలిబన్ ఉగ్రవాదులకు, ఆఫ్ఘన్ ప్రభుత్వ దళాలలకు మధ్య పోరు జరుగుతున్నది. ఇప్పటికే తాలిబన్ ఉగ్రవాదులు కీలక ప్రాంతాలను తమ ఆదీనంలోకి తీసుకోవడంతో ఆయా ప్రాంతాల్లోని అమాయక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే కంధర్ ప్రావిన్స్‌లోని జెరాయ్ జిల్లాలో ఆఫ్ఘన్ రక్షణ దళాలు ఉగ్రవాదుల స్థావరాలపై వైమానిక దాడులు చేశాయి. Read: భారత్ కు మరో ఒలంపిక్ మెడల్… ఈ వైమానిక…
ఉగ్రవాదులకు అండగా ఉండే పాక్, వారిపై సానుభూతిని ప్రదర్శించడం సహజమే. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలీబన్‌లతో కలిసి పనిచేసేందుకు పాక్ ఇప్పటికే పదివేల మందికి పైగా ముష్కరులను ఆ దేశం పంపినట్టు ఇప్పటికే మీడియాలో వార్తలు వచ్చాయి. ఇక ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్‌లో 70 శాతానికి పైగా భూభాగాన్ని ఆక్రమించుకున్నామని ఇప్పటికే తాలిబన్లు చెప్తూ వస్తున్నాయి. చిన్నారులను, మహిళలను హింసిస్తున్నారు. వేలాది మంది అమాయక ప్రజలను తాలిబన్లు పొట్టన పెట్టుకుంటున్నారు. ఇలాంటి వారిపై పాక్ ఉదారతను ప్రదర్శిస్తున్నది. తాలిబన్లు మిలటరీ…
కోవిడ్ కట్టడిలో భాగంగా సౌదీ అరేబియా ప్రభుత్వం తమ పౌరులకు కొత్త ఆంక్షలు విధించింది. రెడ్ లిస్ట్ పేరుతో రూపొందించిన జాబితాలోని దేశాలకు వెళ్లిన వారికి భారీ జరిమానాలు సహా విదేశాలకు వెళ్లకుండా మూడేళ్లపాటు నిషేధం విధించనున్నట్టు ప్రకటించింది. నిషేధిత దేశాలకు వెళ్లడం.. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించడమేనని అక్కడి సర్కారు స్పష్టం చేసింది. అయితే, ఆ జాబితాలో భారత్ తో పాటు యూఏఈ, లిబియా, సిరియా, లెబనాన్, యెమెన్, ఇరాన్, టర్కీ, అర్మేనియా, ఇథియోపియా, సొమాలియా, కాంగో,…
నవ్వడం ఒక వరమైతే, నవ్వించడం గొప్ప వరం. పదిమందిని నవ్విస్తున్న వ్యక్తికి సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని పోలీస్ శాఖలో పనిచేస్తున్న నాజర్ మహ్మద్ అనే వ్యక్తి కమెడియన్‌గా మారిపోయారు. అఫ్ఘనిస్తాన్‌లో ఖంసా జ్వాన్‌గా ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పదిమందికి నవ్వులు పంచుతున్న నాజర్ మహ్మద్‌ను తాలీబన్లు కిడ్నాప్ చేసి దారుణంగా గొంతుకోసి హత్యచేశారు. ఇస్లామ్ ప్రకారం నవ్వించడం నేరం అని అందుకే నాజర్‌ను హత్యచేశారని అంటున్నారు. కాందహార్ ప్రావిన్స్‌లోని…
ఆఫ్ఘనిస్తాన్ నుంచి నాటో, అమెరికా దళాలు తప్పుకోవడంతో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. అమాయక ప్రజలపై దాడులు చేస్తున్నారు. ఆఫ్ఘన్ ఆర్మిని చెదరగోడుతూ అనేక ప్రాంతాలను స్వాదీనంలోకి తీసుకుంటున్నారు. ఇక పాక్ ఇప్పటికే తాలీబన్లకు మద్దతు ఇస్తున్నది. దీంతో వారు మరింతగా రెచ్చిపోతున్నారు. మరోవైపు పాక్ ట్రోలర్లు ట్వట్టర్లో ఆఫ్ఘనిస్తాన్‌ను ట్రోల్ చేస్తున్నారు. మంగళవారం రోజున బక్రీద్ సందర్భంగా అధ్యక్షభవనంలో సామూహిక ప్రార్ధనలు నిర్వహించారు. ఈ ప్రార్ధనల్లో అధ్యక్షుడితో పాటు ఉపాద్యక్షుడు అమ్రుల్లా సలే కూడా పాల్గోన్నారు. ప్రార్ధనలు జరిగే…