ఈరోజు నుంచి న్యూయార్క్ లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాలకు అన్ని దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకాబోతున్నారు. కాగా, ఈ సదస్సు జరిగే సమయంలోనే సార్క్ దేశాలకు చెందిన విదేశాంగ శాఖ మంత్రులు సమావేశం కావాలని ముందుగా నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఆఫ్గనిస్తాన్ లో ప్రస్తుతం తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సార్క్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి తాలిబన్లను కూడా పిలవాలని పాక్ కొత్త మెలిక పెట్టింది. ఆఫ్ఘనిస్తాన్ లో నెలకొన్న ప్రస్తుత…
ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్లు ఆక్రమించుకున్నాక తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి చాలా సమయం తీసుకున్నారు. తాలిబన్ అగ్రనేతలు అఖుండ్ జాదా, బరదర్ లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని అనుకున్నారు. కానీ, అనూహ్యంగా మార్పులు జరిగాయి. తాలిబన్ల కంటే ప్రభుత్వంలో హుక్కాని గ్రూప్ లకు పెద్ద పీట వేశారు. ప్రభుత్వం ఏర్పాటుకు ముందు హుక్కాని గ్రూప్ కు, తాలిబన్లకు మధ్య అధ్యక్ష భవనంలో పెద్ద రగడ జరిగిందని, ఈ రగడలో హైబతుల్లా అఖుండ్ జాదా మృతి చెందారని, బరదర్ ను బందీగా చేసుకున్నారని కథనాలు వస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు ముందు…
గత నెలలో ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశమైన విషయం తెలిసిందే. అక్కడి ప్రభుత్వం కూడా వారికి అధికారాన్ని అప్పగించేసింది. దాంతో అక్కడ తాలిబన్ల రాక్షస పాలన మొదలైంది. అయితే తాజాగా ఆఫ్ఘన్ లో తాలిబన్ ప్రభుత్వం ఐపీఎల్ కు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా మొదట వాయిదా పడిన ఐపీఎల్ ఇప్పుడు యూఏఈ వేదికగా జరుగుతుంది. కానీ తాజాగా ఆఫ్ఘనిస్తాన్ లో ఐపీఎల్ 2021 ప్రత్యక్ష ప్రసారని బ్యాన్ చేసారు తాలిబన్లు. ప్రేక్షకులలో మహిళలు…
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాబూల్ మేయర్‌గా హమ్దుల్లా నమోనీ నియమితులయ్యారు. కాగా, నమోనీ మహిళా ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. డిజైన్, ఇంజనీరింగ్, టాయిలెట్స్ క్లీనింగ్ విభాగాల్లో పనిచేసే మహిళలు మినహా మిగతా మహిళలు ఎవరూ కూడా ఉద్యోగాలకు హాజరుకావొద్దని ఆదేశాలు జారీచేశారు. మహిళలు ఇంటిపట్టునే ఉండాలని, బయటకు రావొద్ధని ఆదేశాలు జారీచేశారు. కాబూల్ నగరపాలక సంస్థలో మొత్తం 3 వేల మంది ఉద్యోగులు ఉండగా అందులో వెయ్యిమంది మహిళా ఉద్యోగులు ఉన్నారు.…
అప్ఘనిస్తాన్ పై తాలిబాన్లు దురాక్రమణ చేయడంతో అక్కడి పరిస్థితులన్నీ రోజురోజుకు దిగజారిపోతున్నాయి. అప్ఘన్లో తామే ప్రభుత్వాన్ని నడిపిస్తామని ప్రకటించుకున్న తాలిబన్లు ప్రజలకు కనీస వసతులు కల్పించడంలో దారుణంగా విఫలమవుతున్నారు. దీనికితోడు షరియా చట్టాలను కఠినంగా అమలు చేస్తామని ప్రకటించడంతో తాలిబన్లపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అయితే గత్యంతరం లేని పరిస్థితుల్లో అప్ఘన్లు అక్కడ బ్రతుకు జీవుడా అంటూ జీవిస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో? ఎవరినీ తాలిబన్లు కిడ్నాప్ చేస్తారో? ఎవరిపై కాల్పులు జరుపుతారో తెలియక బిక్కుబిక్కుమంటూ…
ఆమెరికాపై పాక్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పాక్ నిందలు వేస్తున్నదని ఆరోపించారు. 2001లో అమెరికా దళాలు ఆఫ్ఘనిస్తాన్పై దాడులు చేసిన సమయంలో పాకిస్తాన్లో రాజకీయ సుస్థిరత లేదని, జనరల్ పర్వేజ్ ముషారఫ్ తిరుగుబాటు చేసి పాలన చేజిక్కించుకున్నారని, ముషారఫ్కు అమెరికా మద్ధతు అవసరమవడంతో ఆఫ్ఘన్లో యుద్ధానికి మద్ధతు పలికారని, ఇది తప్పుడు నిర్ణయం అని పాక్ పీఎం పేర్కొన్నారు. అయితే, విదేశీదళాలకు వ్యతిరేకంగా వారికి శిక్షణ ఇచ్చామని, అమెరికాకు వ్యతిరేకంగా…
తాలిబన్లు ఇప్పటికే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సమీకృత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, అందరికి సమానమైన గుర్తింపు ఇస్తామని, ప్రభుత్వంలో అన్ని వర్గాల వారిని కలుపుకొని పోతామని చెప్పిన తాలిబన్లు దానికి విరుద్ధంగా చేశారు. ఒక్క మహిళకు కూడా మంత్రి వర్గంలో స్థానం ఇవ్వలేదు. పైగా మహిళలు ఇంటికే పరిమితం కావాలని, రాజకీయాల్లోకి వారి అవసరం లేదని చెప్పకనే చెప్పారు. బాలికల చదువుకు 1-5 తరగతుల వరకు మాత్రమే అనుమతించారు. దీంతో మహిళల పట్ల తాలిబన్లకు ఎలాంటి దృష్టి…
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. తాలిబన్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత ఆ ప్రభుత్వాన్ని అంతర్జాతీయ సమాజం ఇప్పటి వరకు గుర్తించలేదు. చాలా దేశాలు ఈ విషయంలో ఆచీతూచీ వ్యవహరిస్తున్నాయి. దీంతో ఆఫ్ఘన్ ప్రభుత్వానికి అందించే నిధులు చాలా వరకు ఆగిపోయాయి. తాజాగా ఆ దేశంతో అంతర్జాతీయ ద్రవ్యనిథి సంస్థ సంబంధాలను తాత్కాలికంగా తెంచుకుంది. అంతర్జాతీయ సమాజం గుర్తింపు లేకపోవడంతో ఆఫ్ఘన్ ప్రభుత్వానికి నిధులు అందించలేమని ఐఎంఎఫ్ సంస్థ తెలియజేసింది. దీంతో ఆఫ్ఘన్ దేశానికి…
ఆఫ్ఘనిస్థాన్లో తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లు.. తమ అరాచకాలను కొనసాగిస్తున్నారు.. గతంలో ప్రజాస్వామ్య ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలను రద్దు చేస్తున్నారు.. మహిళలకు రక్షణ కల్పిస్తామంటూనే.. మహిళలపై ఆంక్షలు విధిస్తూ వస్తున్నారు.. ఏ ఆటలు ఆడొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు.. బాలురు-బాలికలు కలిచి చదువుకోవడానికి వీలులేదని స్పష్టంచేశారు.. బాలికలకు మహిళలే పాఠాలు చెప్పాలని.. మహిళలు బాలురకు కూడా పాఠాలు బోధించొద్దు అంటూ.. పిచ్చిపిచ్చి షరతులు పెట్టారు.. ఒకేవేళ కో-ఎడ్యుకేషన్ కొనసాగినా.. తరగతి గదిలో అమ్మాయిలు, అబ్బాయిలకు మధ్య తెరలు…
తాలిబన్లు అఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించుకున్నాక పరిస్థితులన్నీ తలకిందులుగా మారిపోయాయి. అప్ఘన్లో ఎక్కడ చూసినా.. ఎవరినీ కదిలించినా హృదయ విదారక సంఘటనలే దర్శనమిస్తున్నాయి. తమ దేశంలోనే పరాయివాళ్లలా పొట్టచేత బట్టుకొని జీవించాల్సిన దుస్థితి అప్ఘన్లకు రావడం నిజంగా శోచనీయమనే చెప్పాలి. తాలిబన్ల చెర నుంచి తమను రక్షించాలని నిస్సాహాయ స్థితిలో అఫ్ఘన్లు ప్రపంచ దేశాల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. అఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. గతానికి భిన్నంగా తమ పాలన ఉంటుందని తాలిబన్లు…