అఫ్ఘానిస్థాన్‌లో మరో సారి రెచ్చిపోయారు ఉగ్రవాదులు. కుందూజ్ ప్రాంతంలో ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. శుక్రవారం ప్రార్థనలకు వచ్చిన షియా ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ఓ మసీదు వద్ద ఈ దాడి జరిగింది. కుందుజ్ ప్రావిన్స్ బందర్ జిల్లా ఖాన్ అదాబ్‌లో గల షియా మసీదులో జరిగిన పేలుడులో దాదాపు 100 మందికి పైగా చనిపోయినట్టు అఫ్ఘాన్ అధికార వార్త సంస్థ బక్తర్ కథనాలను బట్టి తెలుస్తోంది. అలాగే, మరో 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. గత ఆగస్టులో…
తాలిబన్ల వశమైన ఆప్ఘనిస్థానలో ఓ వైపు అరాచక పాలన కొనసాగుతుంటూ.. మరోవైపు.. దాడులు, ఆత్మహుతి దాడులు అక్కడి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.. ఇవాళ మరోసారి ఆఫ్ఘనిస్థాన్ రక్తసిక్తమైంది.. కుందుజ్‌లో మసీదుపై ఆత్మహుతి దాడి కలకలం రేపింది.. ఈ ఘటనలో మొత్తంగా 100 మంది మృతిచెందారు.. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆత్మాహుతి దాడి జరిగిన సమయంలో.. మసీదులో వందలాది మంది ముస్లింలు ప్రార్థనలు చేస్తున్నారు. నివేదికల ప్రకారం ఆత్మాహుతి దాడి ఘటనలో 100 మంది…
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తరువాత పాక్, రష్యా, చైనా దేశాలకు చెందిన ఎంబసీలు మినగా మిగతా దేశాలకు చెందిన ఎంబసీలను మూసేసిన సంగతి తెలిసిందే. ఆఫ్ఘన్‌లో ప్రజాప్రభుత్వం కుప్పకూలిపోడంతో ఆ దేశం ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నది. తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించాలని, ఆర్థికంగా సహాయం చేయాలని కోరారు. ఇందులో భాగంగా చైనా ముందుకు వచ్చి 30 మిలియన్ డాలర్ల సహాయం చేస్తామని హామీ ఇచ్చింది. తొలి విడతగా చైనా ఆఫ్ఘనిస్తాన్‌లోని శరణార్థుల కోసం దుప్పట్లు,…
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల పాలన మొదలయ్యి నెల రోజులైంది. ఇప్పటి వరకు పాక్ మినహా ఏ దేశం కూడా అధికారికంగా ఆ దేశానికి విమానాలు నడపడం లేదు. దీంతో ఆ దేశం అనేక ఇబ్బందులు పడుతున్నది. అంతర్జాతీయంగా తాలిబన్ల ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు అధికారికంగా ఏ దేశం గుర్తించలేదు. ఇక ఉదిలా ఉంటే, తాలిబన్లు మొదటిసారి భారత ప్రభుత్వానికి అధికారికంగా లేఖను రాశారు. అమెరికా సైనికులు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్లిన తరువాత ఖతర్ టెక్నాలజీని సపోర్ట్‌గా తీసుకొని ఎయిర్‌పోర్ట్‌ను…
పాక్‌లో ఉద్రవాద సంస్థలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని ప్రపంచ దేశాలు గగ్గోలు పెడుతున్నాయి. పాక్‌లో ఉన్న ఆ ఉగ్రసంస్థలు ప్రపంచంలోని వివిధ దేశాల్లో మారణహోమాలను సృష్టిస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లకు పాక్ ఇంటిలిజెన్స్ సహకారం ఉందనన్నది బహిరింగ రహస్యమే. ఇక ఇదిలా ఉంటే అమెరికాకు చెందిన కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ పాక్‌లోని ఉగ్రసంస్థలపై కీలక పరిశోధన చేసింది. టెర్రరిస్ట్ అండ్ అదర్ మిలిటెంట్ గ్రూప్స్ ఇన్ పాకిస్థాన్ పేరిట ఓ నివేదికను తయారు చేసి క్వాడ్ సదస్సు రోజున రిలీజ్…
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటు జరిగి దాదాపు నెల రోజులు కావొస్తున్నది. ఇప్పటి వరకు ఆ దేశంలో ఏర్పాటు చేసిన తాలిబన్ల ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాలు గుర్తించడంలేదు. దీంతో తాలిబన్ ప్రభుత్వంలో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అందరికీ సమానమైన హక్కులు కల్పిస్తామని, మహిళల హక్కులను కాపాడతామని, సమీకృత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన తాలిబన్లు ఇచ్చిన హామీలకు విరుద్ధంగా పాలన సాగిస్తున్నారు. ఇస్లామిక్ చట్టాల ప్రకారమే ప్రభుత్వం నడుస్తుందని, చట్టాలకు విరుద్ధంగా ప్రవర్తించిన వారికి…
అఫ్ఘాన్‌లో ఏర్పాటైన తాలిబన్ల ప్రభుత్వం మహిళల హక్కులను కాలరాస్తోంది. తాలిబన్లు కాబుల్‌ను హస్తగతం చేసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు మూసివేశారు. దీనిపై తాలిబన్ల ప్రభుత్వం కొత్త ప్రకటనను విడుదల చేసింది. దేశంలో ఉన్న మదర్సాలు, ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయని తెలిపింది. కాని అందులో అమ్మాయిలు ఉండరని స్ఫష్టం చేసింది. ఈ ప్రకటన వెలువడిన తర్వాత విద్యార్థులందరూ కలిసి ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ అమ్మాయిలను కూడా…
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తరువాత సమీకృత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన తాలిబన్లు దానిని పక్కన పెట్టేశారు. షరియా చట్టాల ప్రకారమే పాలన ఉంటుందని, పురుషులు చేయలేని పనుల్లో మాత్రమే మహిళలకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. అంతేకాదు, విద్య విషయంలో కూడా మహిళలకు అన్యాయం జరుగుతున్నది. ఇక ఇస్లామిక్ చట్టాలను కఠినంగా అమలు చేయడానికి ఓ శాఖను ఏర్పాటు చేశారు. చట్లాలను ఏవరైనా ఉల్లంఘిస్తే చేతులు, కాళ్లు నరకడం, బహిరంగంగా ఉరితీయడం వంటివి తిరిగి అమలు…
ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్లు ప్రపంచ గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తున్నారు. మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే తాలిబన్లకు పాక్ ప్రభుత్వం అండగా నిలిచింది. ప్రభుత్వం ఏర్పాటులో ఆ దేశం కీలక పాత్ర పోషించినట్టు ఇప్పటికే అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే, దోహ ఒప్పందం ప్రకారం సమీకృత ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. కానీ, ఆఫ్ఘనిస్తాన్ దానికి విరుద్ధంగా తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వంలో హమీద్ కర్జాయ్, అబ్దుల్లా అబ్దుల్లా వంటి సీనియర్…