ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు కావొస్తున్నా ఇప్పటి వరకు ఆ ప్రభుత్వాన్ని ప్రపంచదేశాలు గుర్తించలేదు. ప్రపంచ దేశాలు గుర్తించకపోవడంతో పాటుగా విదేశీ మారక ద్రవ్యనిల్వలను అమెరికా ఫ్రీజ్ చేయడంతో ఆఫ్ఘనిస్తాన్ దిగుమతులు చేసుకోలేకపోతున్నది. దీంతో దేశంలో నిత్యవసర వస్తువుల ధరలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించకపోవడంతో దేశంలో ఐసిస్ ఉగ్రవాద సంస్థ యదేచ్చగా రెచ్చిపోతున్నది. కాందహార్, కుందుజ్ లలోని మసీదుల్లో ఐసిస్ ఉగ్రవాదులు బాంబుపేలుళ్లకు పాల్పడుతున్నాయి. ఈ ఘటనలలో వందలాది…
ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక అక్కడ ప్రజల జీవనం అస్తవ్యస్తం అయింది. నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆహారం లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇది చాలదన్నట్టు తాలిబన్లను స్పూర్తిగా తీసుకొని మిగతా ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఆఫ్ఘన్‌లోని ఐసిస్ ఉగ్రవాద సంస్థ షియా ముస్లీంలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నది. కాందహార్, కుందుజ్ ప్రావిన్స్‌లో షియా ముస్లీంలు ప్రార్థనలు చేస్తున్న మసీదులపై దాడులకు పాల్పడింది. ఆ దాడుల్లో దాదాపుగా 160 మందికి పైగా ప్రజలు మృతి…
ఆఫ్ఘానిస్థాన్ తాలిబన్ల వశం అయిన తర్వాత కూడా పేలుళ్లు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.. మొన్నటి మొన్న మసీదులో ఆత్మాహుతి దాడిలో భారీ ప్రాణనష్టం జరగగా.. ఇవాళ కాందహార్‌లో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. మసీదులో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఈ పేలుళ్లు జరిగాయి.. ఈ ఘటనలో మొత్తం 16 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు చెబుతున్నారు.. కాందహార్‌లో నడిబొడ్డున్న ఉన్న మసీదులో ఈ పేలుడు సంభవించింది.. షియా వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఈ పేలుడు జరిగింది.. 16…
ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక పాకిస్తాన్ దేశం ఒక్కటే కాబూల్‌కు విమానాలు నడుపుతున్నది. కాబూల్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ విమానాలు కొన్ని పాక్‌కు నడుస్తున్నాయి. అయితే, కాబూల్ ఎయిర్ పోర్ట్ తిరిగి ఒపెన్ అయ్యాక విమాన సర్వీసులపై తాలిబన్ల జోక్యం అధికం అయింది. ఈ జోక్యం కారణంగా విమాన టికెట్ల ధరలను విపరీతంగా పెంచారు. కాబూల్ నుంచి ఇస్లామాబాద్‌కు టికెట్ ధరను ఏకంగా 2500 డాలర్లకు పెంచారు. గతంలో టికెట్ ధర 120 నుంచి 150 డాలర్ల మధ్యలో ఉండేది.…
ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్ల ఆక్రమణ తరువాత ఆ దేశంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తాలిబన్లను చూసుకొని ఇతర ఉగ్రవాద సంస్థలు రెచ్చిపోతున్నాయి. రష్యా, పాక్, చైనా మినహా మిగతా దేశాలు తమ రాయబార కార్యాలయాలను మూసేసిన సంగతి తెలిసిందే. తాలిబన్ ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాలు గుర్తించకపోవడంతో ఆ దేశం ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. నిత్యవసర వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో పేదలకు సరైన ఆహారం దొరకడం లేదు. ఈ సమస్య నుంచి ఆఫ్ఘనిస్తాన్ బయటపడాలి అంటే…
అఫ్ఘానిస్థాన్‌లో మరో సారి రెచ్చిపోయారు ఉగ్రవాదులు. కుందూజ్ ప్రాంతంలో ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. శుక్రవారం ప్రార్థనలకు వచ్చిన షియా ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ఓ మసీదు వద్ద ఈ దాడి జరిగింది. కుందుజ్ ప్రావిన్స్ బందర్ జిల్లా ఖాన్ అదాబ్‌లో గల షియా మసీదులో జరిగిన పేలుడులో దాదాపు 100 మందికి పైగా చనిపోయినట్టు అఫ్ఘాన్ అధికార వార్త సంస్థ బక్తర్ కథనాలను బట్టి తెలుస్తోంది. అలాగే, మరో 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. గత ఆగస్టులో…
తాలిబన్ల వశమైన ఆప్ఘనిస్థానలో ఓ వైపు అరాచక పాలన కొనసాగుతుంటూ.. మరోవైపు.. దాడులు, ఆత్మహుతి దాడులు అక్కడి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.. ఇవాళ మరోసారి ఆఫ్ఘనిస్థాన్ రక్తసిక్తమైంది.. కుందుజ్‌లో మసీదుపై ఆత్మహుతి దాడి కలకలం రేపింది.. ఈ ఘటనలో మొత్తంగా 100 మంది మృతిచెందారు.. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆత్మాహుతి దాడి జరిగిన సమయంలో.. మసీదులో వందలాది మంది ముస్లింలు ప్రార్థనలు చేస్తున్నారు. నివేదికల ప్రకారం ఆత్మాహుతి దాడి ఘటనలో 100 మంది…
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తరువాత పాక్, రష్యా, చైనా దేశాలకు చెందిన ఎంబసీలు మినగా మిగతా దేశాలకు చెందిన ఎంబసీలను మూసేసిన సంగతి తెలిసిందే. ఆఫ్ఘన్లో ప్రజాప్రభుత్వం కుప్పకూలిపోడంతో ఆ దేశం ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నది. తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించాలని, ఆర్థికంగా సహాయం చేయాలని కోరారు. ఇందులో భాగంగా చైనా ముందుకు వచ్చి 30 మిలియన్ డాలర్ల సహాయం చేస్తామని హామీ ఇచ్చింది. తొలి విడతగా చైనా ఆఫ్ఘనిస్తాన్లోని శరణార్థుల కోసం దుప్పట్లు,…
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల పాలన మొదలయ్యి నెల రోజులైంది. ఇప్పటి వరకు పాక్ మినహా ఏ దేశం కూడా అధికారికంగా ఆ దేశానికి విమానాలు నడపడం లేదు. దీంతో ఆ దేశం అనేక ఇబ్బందులు పడుతున్నది. అంతర్జాతీయంగా తాలిబన్ల ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు అధికారికంగా ఏ దేశం గుర్తించలేదు. ఇక ఉదిలా ఉంటే, తాలిబన్లు మొదటిసారి భారత ప్రభుత్వానికి అధికారికంగా లేఖను రాశారు. అమెరికా సైనికులు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్లిన తరువాత ఖతర్ టెక్నాలజీని సపోర్ట్‌గా తీసుకొని ఎయిర్‌పోర్ట్‌ను…