టీ20 ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్ రెండో విజయం సాధించింది. ఆదివారం మధ్యాహ్నం నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో 62 పరుగుల తేడాతో ఆప్ఘనిస్తాన్ జట్టు విజయకేతనం ఎగురవేసింది. ఈ మ్యాచ్‌లో అన్ని రంగాల్లో ఆ జట్టు రాణించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన అఫ్ఘానిస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. ఓపెనర్ మహ్మద్ షాజాద్ అత్యధికంగా 45 పరుగులు చేశాడు. 33 బంతులాడిన ఈ భారీకాయుడు 3 ఫోర్లు, 2 సిక్సర్లతో అలరించాడు. మరో ఓపెనర్ హజ్రఫుల్లా జాజాయ్ 27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 33 పరుగులు నమోదు చేశాడు. కెప్టెన్ మహ్మద్ నబీ (17 బంతుల్లో 32) చివర్లో ధాటిగా ఆడడంతో ఆఫ్ఘనిస్థాన్ స్కోరు 150 మార్కు దాటింది.
Read Also: మళ్లీ టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి టీమిండియా
కాగా లక్ష్య ఛేదనలో నమీబియా ఎక్కడా విజయం కోసం ఆడుతున్నట్టు కనిపించలేదు. పూర్తి ఓవర్ల పాటు ఆడిన ఆ జట్టు.. 9 వికెట్లు నష్టపోయి 98 పరుగులకే పరిమితమైంది. నమీబియా ఇన్నింగ్స్‌లో డేవిడ్ వీస్ (26) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అఫ్ఘనిస్తాన్ బౌలర్లలో నవీన్ ఉల్ హక్ 4 ఓవర్లలో 26 పరుగులే ఇచ్చి 3 వికెట్లు సాధించాడు. హమీద్ హసన్ 4 ఓవర్లలో 9 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. గుల్బాదిన్ 4 ఓవర్లు వేసి ఓ మెయిడెన్ ఓవర్‌తో పాటు 19 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు.