UBIT Coin Case: యూబిట్ కాయిన్ కేసు పై ఈడీ నజర్.. నిర్మల్ పోలీసులకు లేఖ..
- నిర్మల్ జిల్లా యూ బిట్ కాయిన్ కేసు పై ఈ డీ నజర్..
- నమోదు అయిన కేసు వివరాలు కావాలని నిర్మల్ పోలీసులకు ఈడీ లేఖ..
- ఇప్పటికే ఈ కేసులో 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UBIT Coin Case: యూ బిట్ కాయిన్ కేసు పై ఈడీ దృష్టి సారించింది. నిర్మల్ జిల్లా లో నమోదు అయిన కేసు వివరాలు కావాలని నిర్మల్ జిల్లా పోలీసులకు ఈడీ లేఖ రాసింది. ఇప్పటికే ఈ కేసులో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పేరుతో నకిలీ యాప్‌ల ద్వారా రూ.కోట్లు దోచుకున్న ముఠా కార్యకలాపాలపై విచారణ జరుపుతోంది. నిర్మల్ ప్రాంతంలో వెలుగు చూసిన ఈ ఘటనలో మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ ప్రాథమికంగా అనుమానిస్తుంది. ఈనేపథ్యంలో ఈడీ లోతుగా విచారణ జరుపుతోంది. నిందితుల ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్టులు, బ్యాంకు ఖాతాలు, ఇతర వివరాలను సమర్పించాలని నిర్మల్ పోలీసులకు ఇటీవల లేఖ రాశారు. వివరాలను సేకరించిన తర్వాత, ఎన్ఫోర్స్మెంట్ కేసు సమాచార నివేదిక (ECIR) నమోదు చేసిన అనంతరం దర్యాప్తు ప్రారంభించనున్నట్లు సమాచారం.
Read also: Onion Peel: చెత్త బుట్టలో పడేసే ఉల్లి పొట్టుతో పుట్టెడు లాభాలు
Also Read
ఒక్క నిర్మల్ ప్రాంతంలోనే దాదాపు రూ.50 కోట్లు దోచుకున్నట్లు ఇప్పటికే పోలీసుల విచారణలో తేలిన విషయం తెలిసిందే.. అయితే ఆ డబ్బును ఎక్కడికి తరలించారు? ఏమి చేసారు? అలాంటి వివరాలతో పాటు ఆ డబ్బుతో కొనుగోలు చేసిన ఆస్తిని జప్తు చేసేందుకు కూడా ఈడీ సిద్ధమవుతున్నట్లు విశ్వనీయ సమాచారం. నిర్మల్‌తోపాటు ఆదిలాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి తదితర జిల్లాలకు ఈ ముఠా విస్తరించినట్లు ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు. ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఎక్సైజ్ ఎస్సై, రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి, కానిస్టేబుల్ లను గత నెల (సెప్టెంబరు) 25న అరెస్టు చేశారు. పదుల సంఖ్యలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఏజెంట్లుగా చేరినట్లు గుర్తించారు. ఏజెంట్లు వసూలు చేసిన సొమ్మును తొలుత ఢిల్లీలోని ముఠా సభ్యులకు పంపించి క్రిప్టో కరెన్సీగా మార్చి దుబాయికి పంపినట్లు అనుమానిస్తున్నారు. ఈ కేసుపై దృష్టి సారించిన ఈడీ రెండు రోజుల క్రితం నిర్మల్ పోలీసులకు లేఖ రాసింది.
Iron Wire in Biscuit: బిస్కెట్ లో ఇనుప తీగ.. పిల్లలు జాగ్రత్త అంటూ వీడియో షేర్ చేసిన ఓ తండ్రి..
తాజావార్తలు
-
Jio Platforms IPO: జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ నేడు ప్రారంభం.. రూ.30,188 కోట్ల ఇష్యూ, జీఎంపీ, లిస్టింగ్ ధర ఎంత?
-
Ind vs Zim : జింబాబ్వేపై భారత్ క్లీన్ స్వీప్..
-
CM Revanth Reddy : జన్మనిచ్చిన గడ్డపై వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Asian Para Games 2026 : రెండో రోజూ భారత్ పతకాల రికార్డు వేట.. ఒక్కరోజే 24 పతకాలు సొంతం
ట్రెండింగ్
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..