Suicide: సెల్‌ఫోన్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య
- సెల్ ఫోన్ కొనివ్వలేదని ఆత్మహత్య చేసుకున్న యువకుడు
- ఆదిలాబాద్ జిల్లాలో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suicide: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సెల్‌ఫోన్ వాడుతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఫోన్‌ను వినియోగిస్తున్నారు. సెల్‌ఫోన్ లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. ఇక సెల్‌ఫోన్ లేకుండా ఓ గంట సేపు ఉన్నారంటే పిచ్చిపిచ్చిగా ప్రవర్తించేవాళ్లు కూడా ఉన్నారు. సెల్‌ఫోన్ చేతిలో ఉంటే లోకాన్నే మరిచిపోతారు. రోజురోజుకు జనాల్లో సెల్‌ఫోన్ పిచ్చి పెరిగిపోతోంది. తాజాగా ఓ యువకుడు సెల్‌ఫోన్ కొనివ్వలేదని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. తలమడుగు మండలంలోని ఉమ్రి గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకొని మేస్త్రం కృష్ణ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Also Read
మేస్త్రం కృష్ణ సెల్‌ఫోన్ కొనివ్వాలని తన తల్లిదండ్రులు అడిగాడు. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు అతడిని మందలించారు. సెల్‌ఫోన్ కొనివ్వమని తల్లిదండ్రులు మందలించడంతో ఈ నెల 3న మేస్త్రం కృష్ణ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఊరికి చివరన ఉన్న గుట్టపైన చెట్టుకు ఉరేసుకున్నాడు. స్థానికులు ఈ విషయాన్ని ఇవాళ గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కొడుకు మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ రోజుల్లో సెల్‌ఫోన్‌కు యువకులు బానిసలవుతున్నారని.. అందుకే కొనివ్వలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
తాజావార్తలు
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
-
Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
-
Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
-
Tilak Varma: ఆ పొజిషన్లో బ్యాటింగ్ చేయడమే ఇష్టం.. కానీ తప్పడం లేదు!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!