Nirmal: కూతురు పుట్టిన కొద్దిరోజులకే తండ్రి చనిపోయాడు.. అయితే ఆ కూతురికి అన్నీ తానే ఉండి చూసుకుంది ఓ తల్లి. కూతురి ఆలనా పాలనా చూసుకుంటూ కుటుంబ భారాన్ని మోస్తూ వచ్చింది. ఇంతలోనే ఏమైందో ఏమో తెలియదు.. ఆ తల్లి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఆత్మహత్య చేసుకునేందుకు సిద్దమైంది. అయితే తన కన్న కూతురు ఏమైపోతుంది అనే మాట మరిచిపోయింది. ఆర్థిక పరిస్థితులతో కుటుంబాన్ని, తన కూతురుని పెంచలేను అనుకుందో ఏమో ఇంట్లో కూతురు లేని సమయంలో ఆ తల్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది.
Read also: CLP Meeting: నేడు సీఎల్పీ సమావేశం.. రేపు అభిషేక్ సింఘ్వీ నామినేషన్..
నిర్మల్ జిల్లా తానూర్ మండలం బేల్ తరోడ గ్రామంలో గుండెలు పిండే విషాదం జరిగింది. తల్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లిని విగత జీవిగా చూసిన ఆ కూతురుకి ఏం చేయాలో అర్థకాని పరిస్థితి నెలకొంది. స్థానికులకు ఈ వార్త తెలియడంతో మృత దేహాన్ని కిందికి దించారు. అయితే పూట గడవడమే కష్టంగా మారిని ఆ కుటుంబానికి అంత్యక్రియలకు కాసులు కరువయ్యాయి. ఆ కూతురు తల్లి మృతదేహం వద్ద ఎవరైనా సహాచం చేస్తారేమో అంటూ దీనంగా చూసింది. కానీ.. ఎవరూ తన తల్లి అంత్యక్రియలకు డబ్బులు ఇవ్వకపోవడంతో చివరకు తల్లికోసం కూతురు భిక్షాటన చేసింది. ఇంటి ముందు ఓ దుప్పటిని పరిచి అంత్యక్రియలకు సహాయం చేయాలను కోరుకుంటూ దీనస్థితిలో కూర్చున్న ఆ బాలికను చూసి.. అక్కడున్న వారందరికి కన్నీరు తెప్పించింది.
Read also: Police Raided Pubs: హైదరాబాద్‌లోని 25 పబ్‌లపై పోలీసులు దాడులు..
చిన్న తనంలోనే తండ్రిని కోల్పోయిన ఆ బాలికకు అన్నీ తానే అయి చూసుకుంటున్న తల్లి కూడా దూరమవడంతో బాలిక ఒంటరిగా మారింది. తల్లి అంత్యక్రియలకు భిక్షాటన చేస్తున్న ఆ బాలికను గ్రామ ప్రజలు కూడా పట్టించుకోక పోవడంతో దీన స్థితిలో ఉండిపోయింది. తన తల్లి అంత్యక్రియలకు సహాయం చేయాలని కోరుతుంది. దాతలు ఎవరైనా తన తల్లి అంత్యక్రియలకు డబ్బు ఇవ్వాలని చేతులెత్తి మొక్కుతూ కన్నీరు కార్చుతుంది. ఆ గ్రామంలో అంతమంది ప్రజలు ఉన్నా ఎవరు ముందుకు రాకపోవడం గమనార్హం. మరి దీనిపై అధికారులు స్పందిస్తారా?.. ఆ కూతురికి సహాయంగా నిలిచేవారు ఎవరు? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
Rains Updates: ఈరోజు, రేపు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు