Home
Adiala Jail
Adiala Jail News
-
Imran Khan: ఇమ్రాన్‌ఖాన్‌కు వైద్య పరీక్షలు పూర్తి.. తిరిగి జైలుకు తరలింపు
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను ఇస్లామాబాద్‌లోని ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. దీంతో ఆయన్ను తిరిగి అడియాలా జైలుకు తరలించారు. వైద్యుల బృందం ఆయనను పరీక్షించి.. జైలులో కొనసాగేందుకు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది లేదని నిర్ధారించినట్లు పాకిస్థాన్ మీడియా కథనాలు వెల్లడించాయి. -
Pakistan: ఇమ్రాన్ ఖాన్‌కు ఊరట.. 9 నెలల తర్వాత భార్య, సోదరిని కలిసిన మాజీ ప్రధాని..
Pakistan: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి మరియు పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పిటిఐ) వ్యవస్థాపకుడు అయిన ఇమ్రాన్ ఖాన్ దాదాపుగా 9 నెలల జైలు జీవితం తర్వాత ఆయన కుటుంబ సభ్యుల్ని కలుసుకునేందుకు అనుమతి లభించింది. ఆయన భార్య బుష్రా బీబీ, సోదరి నూరిన్ నియాజీలు రావల్పిండిలోని అడియాలా జైలులో ఆయనను పరామర్శించారు. పాక్ ప్రభుత్వం గత కొన్ని నెలలుగా ఇమ్రాన్ ఖాన్‌ను కలుసుకునేందుకు ఆయన కుటుంబీకులు, పీటీఐ నేతల్ని అనుమతించడం లేదు. జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ప్రతి… -
Imran Khan: ‘‘1100 రోజులుగా జైలులో ఉన్నాడు, కాపాడండి’’.. ఇమ్రాన్ ఖాన్ కుమారుడి వేడుకోలు..
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, మాజీ క్రికెట్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆయన కుమారుడు ఖాసిం ఖాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తన తండ్రి 1100 రోజులుగా జైలులోనే ఉన్నారని, ఆయన కంటి చూపు క్రమంగా క్షీణిస్తోందని, ఆయనను కలుసుకోవడానికి పాక్ అధికారులు అనుమతి ఇవ్వడం లేదని ఖాసిం ఆరోపించారు. పాక్ సైన్యం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తోందని, రాజకీయ పక్షాలను అణిచివేస్తోందని ఆయన ఆరోపించారు. ఈ విషయంపై అంతర్జాతీయ సమాజం స్పందించాలని కోరారు. ఇమ్రాన్… -
Pakistan: పాకిస్థాన్‌లో హై అలర్ట్.. ఇమ్రాన్ ఖాన్ ఉన్న జైలు నుంచి 14 మంది ఖైదీలు పరార్! అసలేం జరిగిందంటే?
Pakistan: పాకిస్థాన్‌లో అత్యంత పటిష్టమైన భద్రత ఉండే జైళ్లలో ఒకటైన ‘అదియాలా సెంట్రల్ జైలు’ (రావల్పిండి జిల్లా జైలు) మరోసారి అంతర్జాతీయంగా వార్తల్లో నిలిచింది. పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ గత కొన్ని నెలలుగా ఇదే జైల్లో ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఈసారి ఇమ్రాన్ ఖాన్ వల్ల కాకుండా, జైలు భద్రతా వ్యవస్థలోని తీవ్ర లోపాల కారణంగా ఈ జైలు వార్తల్లోకెక్కింది. కోర్టు విచారణ ముగించుకుని తిరిగి జైలుకు వస్తున్న క్రమంలో ఏకంగా… -
Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌ను చంపేందుకు అసిమ్ మునీర్ ప్లాన్..
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కోసం ఆ దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగుతున్నాయి. ఇమ్రాన్ కంటిచూపు 80 శాతం కోల్పోయినట్లు నివేదిక వెలువడటంతో బుధవారం దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. పంజాబ్, ఖైబర్ ఫఖ్తుంఖ్వాలను కలిపే కీలక మార్గాలను అడ్డుకున్నారు. -
Imran Khan: ప్రమాదకరంగా ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం.. కుడి కంటిచూపు కోల్పోయిన పాక్ మాజీ పీఎం..
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం ప్రమాదంలో పడింది. రెండున్నరేళ్లగా రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్న ఆయన కంటి చూపు కోల్పోయినట్లు తాజా నివేదిక చెబుతోంది. సుప్రీంకోర్టు నియమించిన అమికస్ క్యూరీ సల్మాన్ సప్దార్ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. పాక్ సైన్యం ఉద్దేశపూర్వకంగా, అమానవీయంగా, చట్టవిరుద్ధంగా ఇమ్రాన్ ఖాన్‌ను నిర్బంధించినట్లు నివేదిక బహిర్గతం చేసింది. జైలు అధికారులు ఇమ్రాన్ ఖాన్‌ను వైద్యం అవసరమని చెప్పినా పట్టించుకోలేదు. ఆయన తన కుడి కంటిలో… -
Imran Khan: “మా తండ్రిని ఇక చూడలేమేమో”.. ఇమ్రాన్ ఖాన్ కుమారుల సంచలన వ్యాఖ్యలు..
Imran Khan: పాకిస్తాన్ మాజీ సీఎం, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌ను అక్కడి షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం అవినీతి ఆరోపణలతో రావల్పిండిలోని అడియాల జైలులో వేసింది. ఇటీవల, ఆయన మరణించాడనే ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. పాకిస్తాన్ వ్యాప్తంగా ఆయన అభిమానులు, పార్టీ మద్దతుదారులు తీవ్ర ఆందోళనలు నిర్వహించారు. -
Imran Khan: ఇమ్రాన్‌ఖాన్‌కు వేధింపులు.. జైలు బయట సోదరీమణులు ఆందోళన
పాకిస్థాన్‌లో మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను చూసేందుకు సోదరీమణులకు జైలు అధికారులు నిరాకరించారు. దీంతో అడియాలా జైలు ఎదుట ఉద్రిక్తతలు నెలకొన్నాయి. సోదరీమణులంతా జైలు ఎదుట ఆందోళన దిగారు. ఇమ్రాన్‌ఖాన్‌ను జైలు అధికారులు హింసిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. -
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలతో ఉన్నాడు, కానీ.. సోదరి సంచలన ఆరోపణలు..
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ ‘‘ప్రాణాలతోనే’’ ఉన్నారని ఆయన సోదరి ఉజ్మా ఖాన్ ప్రకటించారు. గత కొన్ని రోజులుగా పాక్ వ్యాప్తంగా ఇమ్రాన్ మరణించారని, ఆయనను అసిమ్ మునీర్ నేతృత్వంలోని సైన్యమే హత్య చేసిందనే ఊహాగానాలు వెలువడ్డాయి. -
Imran Khan: “మరణం” వార్తలకు చెక్.. ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు సోదరికి అనుమతి..
Imran Khan: గత కొంత కాలంగా పాకిస్తాన్ వ్యాప్తంగా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చనిపోయినట్లు వార్తలు వెల్లువెత్తాయి. అవినీతి ఆరోపణలపై రావల్పిండిలోని అడియాలా జైలులో గత మూడేళ్ల నుంచి శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్ ఆచూకీ గత నాలుగు వారాలుగా కనిపించలేదు. ఆయనను కలిసేందుకు ఆయన చెల్లెళ్లను, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్ ముఖ్యమంత్రికి కూడా అనుమతించకపోవడంతో అనుమానాలు బలపడ్డాయి. పీ
తాజావార్తలు
-
Asia Cup Trophy Row: అది ప్లేయర్స్ నిర్ణయం కాదు.. బీసీసీఐ డెషిషన్!
-
Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!