Congress: పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) సమస్యకు భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూనే కారణమని నిన్న పార్లమెంట్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. ఆయన చేసిన కాల్పుల విరమణ, ఐక్యరాజ్యసమితిలోకి కాశ్మీర్ సమస్యను తీసుకుపోవడం వంటి ఈ రెండు తప్పులు కాశ్మీర్ వివాదానికి కారణమయ్యాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్(సవరణ) బిల్లు-2023, రిజర్వేషన్(సవరణ) బిల్లు-2023 బిల్లులను ఆయన నిన్న లోక్‌సభలో ప్రవేశపెడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
లోక్ సభలో గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ (శుక్రవారం) కాసేపు సభను స్పీకర్ ఓం బిర్లా వాయిదా వేశారు. లోక్‌సభ లో కాంగ్రెస్ పార్టీ పక్షనేత అధిర్ రంజన్ పై సస్పెన్షన్ వేయడంపై విపక్షాలు సభలో ఇవాళ నిరసన బాట పట్టాయి.