టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తన హెల్త్ అప్డేట్ గురించి వెల్లడించారు. డెంగ్యూ సోకడంతో ఆయన సెప్టెంబర్ 18న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అయితే శేష్ రక్తంలో ఉన్న ప్లేట్‌లెట్స్ అకస్మాత్తుగా పడిపోయాయని, ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యుల బృందం నిశితంగా పరిశీలిస్తోందని, శేష్ ఆరోగ్యానికి సంబంధించిన ఏ అప్డేట్ అయినా అధికారికంగా ప్రకటించబడుతుందని సన్నిహిత వర్గాలు…