టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తన హెల్త్ అప్డేట్ గురించి వెల్లడించారు. డెంగ్యూ సోకడంతో ఆయన సెప్టెంబర్ 18న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అయితే శేష్ రక్తంలో ఉన్న ప్లేట్‌లెట్స్ అకస్మాత్తుగా పడిపోయాయని, ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యుల బృందం నిశితంగా పరిశీలిస్తోందని, శేష్ ఆరోగ్యానికి సంబంధించిన ఏ అప్డేట్ అయినా అధికారికంగా ప్రకటించబడుతుందని సన్నిహిత వర్గాలు తెలిపారు. ఈ అప్డేట్ వచ్చి దాదాపు వారం గడిచిపోతోంది. తాజాగా అడవి శేష్ స్వయంగా ట్విట్టర్ లో ‘ఇంటికొచ్చేశాను… రెస్ట్ తీసుకుంటున్నా’ అని పోస్ట్ చేశారు.
Read Also : మోహన్ బాబు వర్సెస్ చిరంజీవి అనుకుంటున్నారు… కానీ…!
ప్రస్తుతం అడవిశేష్ “మేజర్” సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. 26/11 ముంబై టెర్రర్ అటాక్ లో అమరవీరుడైన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో మహేష్ బాబు జిఎంబి ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ మూవీని నిర్మిస్తోంది. ఈ సినిమా విడుదల గురించి టాలీవుడ్ ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
Back home. Rest & Recuperation.
— Adivi Sesh (@AdiviSesh) September 27, 2021