ఈమధ్య మాజీ భార్యతో ఏర్పడిన వివాదం కారణంగా అరెస్ట్ అయి బయటకొచ్చిన మలయాళ నటుడు బాలా మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. ఎర్నాకులంలోని కలూర్ పావకులం ఆలయంలో వీరి వివాహం జరిగింది. బాలాకి మేనమామ కూతురు కోకిలతో వివాహమైంది. తాను మళ్లీ పెళ్లి చేసుకుంటానని బాలా ఇప్పటికే ప్రకటించాడు. ఇటీవల మీడియాతో ఇంటరాక్షన్ సందర్భంగా, బాలా తాను మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నానని పేర్కొన్నాడు. వారికి చెందిన రూ. 250 కోట్ల విలువైన ఆస్తులను చూసుకోవాలనుకుంటున్నానని అన్నాడు. అయితే అప్పుడు…
మాజీ భార్య ఫిర్యాదుతో నటుడు బాలా అరెస్ట్ అయ్యాడు. ఉదయం పాలారివట్టలోని బాలా ఇంటి నుంచి కడవంత్ర పోలీసులు బాలని అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియా ద్వారా తన పరువు తీశారంటూ మాజీ భార్య చేసిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. తన కుమార్తె విషయంలో బాల చేసిన వ్యాఖ్యలు అతనిని అరెస్టు చేయడానికి దారితీశాయి. జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో బాల మేనేజర్ రాజేష్,…