పాకిస్తాన్‌లో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. పంజాబ్ ప్రావిన్స్‌లో జరిగిన ఈ ప్రమాదంలో 30 మంది మృతి చెందారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో 40 మందికి గాయాలయ్యాయి. బక్రీద్ పండుగ సందర్భంగా సుమారు 70మందికి పైగా కార్మికులు సియాల్‌కోట్ నుంచి రజన్‌పూర్‌కు పయనమయ్యారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం ముజప్పర్‌గడ్‌లోని డేరాఘాజీ ఖాన్ వద్ద ఇండస్ హైవేపై ఎదురుగా వస్తున్న కంటైనర్‌ను ఢీకొన్నది. ఈ ప్రమాదంలో 30 మంది అక్కడికక్కడే మృతి చెందగా 40…
ఇరాక్‌లోని ఓ కోవిడ్ ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో 50 మంది మృతి చెందారు. మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళ్తే…ఇరాక్‌లోని నసీరియా పట్టణంలోని అల్ హుస్సేన్ అనే కోవిడ్ ఆసుపత్రిలో ఆక్సీజన్ ట్యాంక్ పేలింది. ఈ పెలుడు కారణంగా మంటలు పెద్దఎత్తున వ్యాపించాయి. క్షణాల వ్యవధిలోనే మంటలు కరోనా రోగులు చికిత్స పొందుతున్న కోవిడ్ వార్డుకు వ్యాపించాయి. Read: పుకార్లకు చెక్ పెట్టిన తలైవి…
రంగారెడ్డి : రాజేంద్రనగర్ మైలార్ దేవిపల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మోటర్ సైకిల్ ను సిమెంట్ రెడీ మిక్స్ లారీ ఢీ కొట్టింది. దీంతో మోటర్ సైకిల్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. లారీ చక్రాల కింద ముగ్గురు యువకులు నలిగిపోయారు. మైలార్ దేవిపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఈ రోడ్డు ప్రమాదం ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు… హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. అప్పటికే రోడ్డు…
హైదరాబాద్ లో మరో కారు బీభత్సం సృష్టించింది. ప్రేమావతి పేటలో ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడి పైకి దూసుకు వెళ్ళింది కారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కారు బలంగా ఢీ కొట్టడంతో బాలుడు ఒక్కసారిగా గాలిలో ఎగిరి కింద పడ్డాడు. తీవ్రగాయాలు కావడంతో బాలుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే బాలుడి పరిస్థితి విషమంగా వున్నట్లు వైద్యులు తెలిపారు. బయట పెద్ద శబ్దం రావడంతో ఇంట్లో నుండి రోడ్డు పైకి వచ్చిన కాలనీ వాసులు……
సినీ నటుడు కత్తి మహేష్‌కు పెను ప్రమాదమే తప్పింది. కత్తి మహేష్ ప్రయాణిస్తోన్న కారు ముందుగా వెళుతున్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కత్తి మహేష్‌కు స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. ఈ ఘటన నిన్న అర్ధరాత్రి చోటుచేసుకుంది. అసలు వివరాల్లోకి వెళితే… నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం జాతీయ రహదారిపై ముందు వెళుతున్న లారీని కత్తి మహేష్ ఇనోవా కారు ఢీకొట్టింది. read also :మరోసారి పెరిగిన పెట్రోల్ , డీజిల్ ధరలు…
శంషాబాద్ ఔటర్ రింగు రోడ్డు సర్విస్ రోడ్డుపై కారు భీభత్సం ఇద్దరు యువకులకు గాయాలు హాస్పిటల్ కు తరలించారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఔటర్ రింగు రోడ్డు సర్విస్ రోడ్డు చెన్నమ్మ హోటర్ వద్ద బ్రీజా కారు భీభత్సం సృష్టించి కాల్వట్టులోకి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్రగాయాలు కావడంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని హాస్పిటల్ కు తరలించారు. కారులో ఉన్న ఇద్దరు…
దేశరాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్‌లో అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి ఎయిమ్స్‌లోని తొమ్మిదవ అంతస్తులో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. 22 ఫైర్ టెండర్స్ తో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. తొమ్మిదవ అంతస్తులో డయాగ్నోస్టిక్ ల్యాబ్‌లు, పరీక్షా విభాగాలు ఉన్నాయని, కొవిడ్ 19 నమూనాలను సేకరించిన ప్రాంతంలో మంటలు చెలరేగినట్టు అధికారులు పేర్కొన్నారు. అయితే, ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.
చైనా పేరు చెబితేనే ప్రపంచం భయపడిపోతున్నది. చైనాలో కొత్తకొత్త వైరస్లు బయటపడుతున్నాయి. రీసెంట్గా మరో నాలుగు కొత్త కరోనా వైరస్లు బయటపడ్డాయి. ప్రపంచం కరోనాతో ఇబ్బందులు పడుతుంతే, చైనా మాత్రం అభివృద్ది దిశగా పరుగులు తీస్తున్నది. ఇక ఇదిలా ఉంటే, ఈ రోజు చైనాలో ఘోరప్రమాదం జరిగింది. చైనాలోని హుబే ప్రావిన్స్ వద్ద గ్యాస్‌పైప్ లైన్ పేలింది. ఈ పేలుళ్లలో 11 మంది మృత్యవాత పడ్డారు. మరో 37 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై అధికారులు దర్యాప్తు…
నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఢీకొనడంతో 18 మంది మృతి చేందారు. పలువురికి తీవ్రమైన గాయాలయ్యాయి. నైజీరియాలోని జిగువా ప్రాంతంలో ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు డీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. రోడ్లు అద్వాన్నంగా ఉండటం, బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉండటంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదానికి రాష్ డ్రైవింగ్ కారణం అయి ఉండోచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఓ బస్సు డ్రైవర్ కాలు విరిగిపోయింది. ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు అ…