వినాయక నిమజ్జనం రోజున తెలంగాణ రాష్ట్రంలో విషాదం నెలకొంది. నాగర్ కర్నూల్ జిల్లా లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే… ఈ ఘోర రోడ్డు ప్రమాదం లో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… నాగర్ కర్నూల్ జిల్లా… పదర మండలంలోని మద్ది మడుగు సమీపం లో దేవర కొండ డిపో బస్సును…. ఆటో ఢీ కొట్టినట్లు సమాచారం అందుతోంది. అయితే.. ఈ ఘోర ప్రమాదం లో ఏకంగా నలుగురు వ్యక్తులు…
సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంపై రాయదుర్గం సీఐ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ… సమాచారం తెలియగానే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ఆయనను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి సీసీ కెమెరా ఫుటేజీని సేకరించాము. ఐపీసీ సెక్షన్లతో పాటు మోటార్ వేహికిల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసాము.ఐపీసి సెక్షన్లు 336, 279 లతో పాటు మోటార్ వేహికిల్ యాక్ట్ 184 కింద కేసు నమోదు చేసాము. తేజ్ ప్రయాణం చేసిన బైక్ స్పీడ్ ను ఎస్టిమేట్…
టాలీవుడ్ హీరో కు నిన్న సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. బైక్ పై నుంచి పడిన తేజ్ కు తీవ్ర గాయాలు కావడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదం సమయంలో తేజ్ నడుపుతున్న బండి ‘త్రియంఫ్’ కంపెనీకి చెందింది. దాంతో ఆ బండి షో రూమ్ నిర్వాహకులు ప్రమాదం పై స్పందిస్తూ.. త్రియంఫ్ వెహికిల్ మిస్టేక్ ఏమాత్రం లేదు. ఒక్కో మోడల్.. ఒక్కో రకమైన ప్రత్యేకతతో డిజైన్ అవుతాయి.…
ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు వెనుక చక్రాలు ఒక్కసారిగా ఊడిపోయాయి.. అయితే, ఓ కుదుపు కుదిపి.. ముందుకు దూసుకెళ్లినా.. బస్సులోని ప్రయాణికులు అంతా సురక్షితంగా ఉండడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా గోకవరం నుండి మారేడుమిల్లి మీదుగా గుర్తేడు వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు వెనక చక్రాలు ఊడిపోయాయి.. వై. రామవరం మండలం ఎడ్లకొండ వద్దకు బస్సు రాగానే.. రెండు వెనుక చక్రాలు ఒక్కసారిగా బస్సు నుంచి విడిపోయాయి.. పెద్దశబ్దం రావడంతో బస్సులో ఉన్నవారితో పాటు…
నిర్మల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. అందులో ఇటీవలే పెళ్లి అయిన ఓ మహిళ ఉండటం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే…. నిర్మల్ జిల్లా కడెం మండలం పాండవ పూర్ బ్రిడ్జి వద్ద అదుపు తప్పి.. కారు బోల్తా కొట్టింది. అయితే… ఆ కారులో ప్రయాణిస్తున్న పెండ్లి కూతురు మౌనిక మరియు పెండ్లి కూతురు తండ్రి రాజాం అక్కడిక్కడే మృతి చెందారు.…
నల్గొండ జిల్లా మిర్యాలగూడ చింతపల్లి హైవే వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని శ్రీ కృష్ణ ట్రావెల్స్ బస్ ఢీ కొట్టింది. అయితే.. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో పది మంది కి తీవ్ర గాయాలు అయ్యాయి. Ap39x6414 నెంబర్ గల శ్రీ కృష్ణ ట్రావెల్స్ బస్సు ఒంగోలు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక క్షత గాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు…
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుల్గానాలోని సమృద్ధి ఎక్స్ప్రెస్ వే పై ఐరన్లోడ్ తో వెళ్తున్నలారీ బోల్తా పడింది. ఆ ఘటనలో 13 మంది మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. టిప్పర్ లారీపై 16 మంది కూలీలు ఐరల్లోడ్పై కూర్చోని ప్రయాణం చేస్తున్నారు. సడన్గా ఎక్స్ప్రెస్ వే పై అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డుపై మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోవడంతో ఆ…
మణుగూరు సింగరేణి ఓపెన్ కాస్ట్ 2 లో ప్రమాదం చోటుచేసుకుంది. ఎమర్జెన్సీ కోసం తిరిగే బొలెరో వాహనం మీదకు డంపర్ ఎక్కింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మగ్గురు మృతి చెందినట్టు సమాచారం. సింగరేణిలో పనిచేస్తున్న ఇద్దరు కార్మికులతో పాటు బొలెరో డ్రైవర్ కూడా మృతిచెందారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును అంచనా వేస్తున్నారు. Read: ప్రాణాలకు తెగించి…
మంత్రి కేటీఆర్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. సిద్ధిపేట ఔటర్ బైపాస్ పైన, మెడికల్ కాలేజీ దగ్గరలో నిన్న రాత్రి బైక్ ఆక్సిడెంట్ చోటు చేసుకుంది. బైక్ పై వెళ్తూ ప్రమాదవశాత్తూ డివైడర్ కు ఢీ కొట్టి, తీవ్రంగా గాయపడ్డారు సిద్ధిపేటకు చెందిన ఇద్దరు ముస్లిం వ్యక్తులు. అయితే.. అదే సమయంలో సిరిసిల్ల పర్యటన ముగించుకున్న కేటీఆర్.. అదే మార్గంలో వచ్చారు. read also : మహిళలకు షాక్… మళ్లీ పెరిగిన బంగారం ధరలు ఈ నేపథ్యంలో…
నాగోల్ అల్కాపురి లో గల టాటా షో రూమ్ లో మొదటి అంతస్తు నుంచి కారు కిందపడింది. కారును కొనుగోలు చేసింది మేడిపల్లి కి చెందిన భగవత్ అనే వ్యక్తి. మొదటి అంతస్తులో ఉన్న కారును హైడ్రాలిక్ సిస్టం పై కిందికి తీసుకొనివచ్చి కారు కొనుగోలు చేసిన వ్యక్తికి ఇవ్వాలి షోరూమ్ సిబ్బంది. కానీ మొదటి అంతస్తులో ఉన్న కారును భగవత్ నడిపేందుకు షోరూం సిబ్బంది అనుమతి ఇచ్చారు. కారును స్టార్ట్ చేయడం తో హఠాత్తుగా మొదటి…