అనంతపురం జిల్లా గార్లదిన్నే మండలం కల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు, ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. శనివారం తెల్లవారుజామున బియ్యం లోడుతో వెళ్తు ట్రాక్టర్‌ను ప్రైవేట్ బస్సు ఢీకొట్టగా.. ట్రాక్టర్‌లో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
Accident : యుపిలోని ఒరాయ్‌లోని బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వేలోని కైథారి టోల్ ప్లాజా సమీపంలో ఆదివారం అర్థరాత్రి వేగంగా వస్తున్న డంపర్.. లోడర్‌ను ఢీకొట్టింది.
Bus Accident: ప్రధాని నరేంద్ర మోడీ ర్యాలీకి వెళ్తున్న బీజేపీ కార్యకర్తల బస్సు ప్రమాదానికి గురైంది. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు ఇద్దరు బీజేపీ కార్యకర్తలు మృతి చెందగా, మరో 5 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
పశ్చిమ బెంగాల్‌లోని పుర్బా మేదినీపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని హల్దియా-మెచెడా రాష్ట్ర రహదారిపై ఆయిల్ ట్యాంకర్ బస్సును ఢీకొనడంతో 27 మంది ప్రయాణికులు గాయపడ్డారు.