Building Collapse : సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లి గురుకుల పాఠశాల విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. మధ్యాహ్నం భోజనం చేయడానికి వెళ్లే సమయంలో పాఠశాల భవనం ఒక్కసారిగా కూలిపోయింది. విద్యార్థులు అప్రమత్తంగా వ్యవహరించి ముందే గదుల నుంచి బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మంగళవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో విద్యార్థులు భోజనశాలకు వెళ్తున్నప్పుడు, భవనంలో నుంచి శబ్దాలు రావడం గమనించారు. దీంతో వారు వెంటనే గదుల నుంచి బయటకు పరుగు తీశారు.
Asia Cup 2025: ప్లేయింగ్ 11ను మీకు మెసేజ్ చేస్తా.. శాంసన్‌పై ప్రశ్నకు సూర్య రిప్లై!
కొద్ది క్షణాల్లోనే భవనం కూలిపోయింది. ఈ క్రమంలో ఇటుకలు ఎగిరి వచ్చి తగలడంతో ముగ్గురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకవేళ ఈ ఘటన రాత్రిపూట జరిగి ఉంటే ప్రాణ నష్టం జరిగి ఉండేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలోనే భవనం శిథిలావస్థకు చేరిందని ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ ఘటనపై అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
Gold Rates : బంగారం రికార్డు ధర.. ఎప్పుడూ లేని రీతిలో పెరిగిన బంగారం రేట్లు