ABVP: హైకోర్టు నూతన భవనానికి 100 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. రాజేంద్రనగర్ మండలం బుద్వేల్ ప్రేమావతిపేట సమీపంలో భూమిని మంజూరు చేసింది. ఇందుకు సంబంధించి రేవంత్ ప్రభుత్వం జీవో 55ని కూడా జారీ చేసింది. హైకోర్టు నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన 100 ఎకరాల స్థలం బుద్వేల్ గ్రామంలోనే ఉంది. ఇక్కడ 1966లో అప్పటి ప్రభుత్వం వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయానికి 2,500 ఎకరాలు కేటాయించింది. అయితే దీనిపై రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిపాలన భవనం ముందు ఏబీవీపీ ఆందోళనకు దిగింది. విశ్వవిద్యాలయంకు సంబంధించిన 100 ఎకరాల స్థలాన్ని హైకోర్టుకు మంజూరు నిరసనగా ధర్నా చేపట్టింది. పరిపాలన భవనం ముందు విద్యార్థుల బైటాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు.
Read also: Ponnam Prabhakar: కుల వృత్తులను కాపాడడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది
తక్షణమే హైకోర్టుకు మంజూరు చేసిన GO ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెద్ద పెట్టున నినాదాలు చేస్తున్న విద్యార్థులు. వ్యవసాయ విశ్వవిద్యాలయం కు సంబంధించిన స్థలంలో ఒక్క గజం కూడా ఇవ్వడానికి వీలులేదన్నారు. హైకోర్టు నిర్మాణ ప్రతిపాదనను వేరే చోటుకు మార్చాలని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు రాజేంద్రనగర్ జయ శంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంకు పోలీసులు చేరుకున్నారు. ఆందోళన చేయడానికి వీలు లేదంటున్న పోలీసులు. హైకోర్టు నిర్మాణ స్థలం దెగ్గరికి వెళ్లి మీ నిరసన తెలపండి. ఇక్కడ కాదన్న కాప్స్ సూచించారు. పరిపాలన భవనం ముందే మా నిరసన కొనసాగిస్తామన్నారు విద్యార్థులు. ఇక్కడి నుండి వెళ్లం మంటూ భీక్షించి కూర్చున్నారు. జీవో 55 ను రద్దు చేయాలని యూనివర్సిటీలో విద్యార్ధుల ఆందోళన చేసారు. రాజేంద్రనగర్ యూనివర్సిటీ భూములను అమ్ము కుంటున్నరని మండిపడ్డారు. గతంలో వీసీ పని చేసిన అధికారి పలు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.
Lagadapati Rajagopal: రంగంలోకి లగడపాటి… హర్షకుమార్, ఉండవల్లితో భేటీ